ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Monday, 19 January 2015
మహా మృత్యుంజయ మంత్రం ఫలితం ..
మహా మృత్యుంజయ మంత్రం ఫలితం .......జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకువస్తుందో ఊహించలేం. అలాగే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు ఈ శరీరంపై దాడిచేస్తుందో తెలియదు. ఆ వ్యాధి జీవుడిని ఈ లోకం నుంచి వెంటనే తీసుకువెళుతుందో, లేదంటే జీవించినంత కాలం బాధపెడుతుందో కూడా తెలియదు.
ఇలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని నిరాశా నిస్పృహలకు లోనవ్వడం జరుగుతూ వుంటుంది. అయితే ఎలాంటి దుర్ఘటనల బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేదిగా 'మహా మృత్యుంజయ మంత్రం' చెప్పబడుతోంది. మహా మృత్యుంజయ మంత్రం అసమానమైనది. ఈ మంత్ర ప్రభావం దుర్ఘటనలకు దూరంగా ఉండేలా చేస్తూ సదా రక్షిస్తూ వుంటుంది.
'' ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్. ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్'' అంటూ ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ వుండటం వలన ప్రాణహాని కలిగించే వివిధ రకాల ప్రమాదాల నుంచి, వ్యాధుల బారి నుంచి రక్షణ లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ప్రతి రోజు ఉదయాన్నే పూజా సమయంలో ఈ మంత్రాన్ని పఠించడాన్ని ఒక నియమంగా పెట్టుకోవాలి. అనునిత్యం ఈ మంత్రాన్ని పఠిస్తూ వుండటం వలన, అది ఒక రక్షణ కవచంలా కాపాడుతూ ఉంటుందని స్పష్టం చేయబడుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment