What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Tuesday, 27 January 2015

కఠోపనిషత్తు



కఠోపనిషత్తు

కృష్ణ యజుర్వేదం లోని తైత్తిరీయ శాఖలో ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. శంకరాచార్యులు భాష్యాలు వ్రాసిన పది ఉపనిషత్తులలో ఒక ముఖ్యమైన ఉపనిషత్తు కఠోపనిషత్తు. 108 ఉపనిషత్తులలో ముఖ్యమైన ఈ ఉపనిషత్తుది మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లిలు ఉన్నాయి. కఠోపనిషత్తు లోని శ్లోకాల సారానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాల సారానికి చాలా సారూప్యత ఉంటుంది(ఉపనిషత్తుల సారమే భగవద్గీత అని భగవానుడే చెప్పాడు కదా).
శాంతి మంత్రం


ప్రతి ఉపనిషత్తు కి ఒక శాంతి మంత్రం ఉంటుంది.అదే విధంగా కఠోపనిషత్తు శాంతి శ్లోకం లేదా మంత్రం

ఓం సహనావవతు ,
సహనౌ భుజన్తు,
సహవీర్యం కరవావహై,
తేజస్వి నా వధీతమస్తు,
మావిద్వాషావహై ,
ఓం శాంతి: శాంతి: శాంతి:

మూల కథ
వాజశ్రవుడు (ఉద్దాలకుడు) విశ్వజిద్యాగం చేస్తాడు.యాగం చివర తనవద్ద ఉన్న సర్వ సంపదలు బ్రాహ్మణు లకు దానమిస్తాడు.వాజశ్రవుడు దానమిస్తున్న సంపదలో ఉన్న గోవులలో ముసలి గోవులు కూడా చాలా ఉంటాయి. వాజశ్రవుని కుమారుడైన నచికేతుడు దానిని గమనించి ఈ విధంగా ముసలి గోవులను దానమివ్వడం వల్ల తండ్రి ఆనంద లోకాలకు ఏవిధంగా చేరుకొంటాడు అని భావిస్తాడు.

పీతోదకా జగ్ధతృణా దుగ్ధ్దోహా నిరింద్రియా:
అనందా నామ తే లోకాస్తాన్ స గచ్చతి తా దతాత్
సహోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి
ద్వితీయం తృతీయం త హఓవాచ మృత్యవే త్వా దదామీతి

నచికేతుడు తన తండ్రి వద్ద కు వెళ్ళి తనను ఎవరికి దానమిస్తున్నావు అని అడుగు తాడు.ఒకసారి సమాధానం రాకపోయేటప్పటికి అదే ప్రశ్న మూడుసార్లు వేస్తాడు. తండ్రి విసిగి యముడి కి దానమిస్తున్నాను అని అంటాడు.

పితృ వాక్య పరిపాలన కోసం నచికేతుడు యమ లోకానికి వెడతాడు. అక్కడ యమధర్మరాజు కనిపించడు . నచికేతుడు మూడు రాత్రులు యమలోకం లో అన్నపానాలు లేకుండా గడుపుతాడు. యముడు ఇంటికి తిరిగి వచ్చి, అతిథి బ్రాహ్మణుడు మూడు రోజులు అన్నపానాలు లేకుండా ఉండడం చూసి, నచికేతుడి కి మూడు వరాలు ప్రసాదిస్తాను అని అంటాడు. నచికేతుడు మొదటి వరంగా తన తండ్రి తనను మళ్లీ చూసేటప్పటికి శాంతస్వరూపం లో ఉండాలి అని కోరుకొంటాడు. రెండోవరం గా యముడు నచికేతుడికి అగ్నికార్యం ఏవిధంగా చెయ్యాలో బోధిస్తాడు. ఆవిధంగా నచికేతుడు అగ్నివిద్యోపదేశం పొందడం వల్ల దానిని నచికేతాగ్ని అని పిలుస్తారు.

చివరి వరంగా నచికేతుడు మనిషి మరణించిన తరువాత మరో దేహంతో సంబంధపడే జీవి ఉంటాడా, ఉండడా అనే విషయాన్ని విశదీకరించమంటాడు. అప్పుడు యముడు నచికేతుడి బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి కల యోగ్యత ను పరీక్షించదలచి రకరకాలైన ప్రలోభాలు పెడతాడు. వేరే వరాన్ని ఏదైనా కొరుకొమ్మంటాడు.అయితే నచికేతుడు నిశ్చల మనస్సుతో సాంసారిక భోగాలను తృణీకరించి జ్ఞాన విద్య మీదే మనస్సు కేంద్రీకరిస్తాడు. యముడు నచికేతుడి వైరాగ్యానికి మెచ్చి మనిషి మరణాంతరం జరిగే విషయాలు చెబుతాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML