What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 23 March 2014

రథసప్తమి, సూర్యదేవాలయాల ప్రాముఖ్యత


రథసప్తమి,  సూర్యదేవాలయాల ప్రాముఖ్యత

ఖగోళ శాస్రంలోని అనేక నక్షత్రాలలో సూర్యుడు ఒక నక్షత్రం, నవగ్రహాలకు సూర్యుడు అధిపతి , ఎల్లప్పుడు ఏడు తలలతో ,ఏడు గుర్రములతో తేజోవంతంగా ప్రకాశిస్తూ తిరుగుతూ ఉంటాడు, భారత దేశంలో సూర్యునికి అనేక ప్రాంతాలలో సూర్య దేవాలయాలు ఉన్నాయి, ఒరిస్సాలోని కోణార్క్ సూర్యదేవాలయం ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయాన్ని గంగవంశం రాజు అయిన నరసింహ వర్మ నిర్మించారు. గుజరాత్ లోఅని మొధిర ప్రాంతంలో సూర్యదేవాలయం క్రి.శ.1026 సంవత్సరంలో భీం దేవ్ అనే
 రాజు ఈ దేవాలయాన్ని నిర్మిచారు. ఇంకా మన దేశంలో కొన్ని ప్రాంతాలలో కూడా సూర్యదేవాలయాలు ఉండేవి. ముస్లింల పరిపాలనలో అవి నేలమట్టం కాబడ్డాయి. మన రాష్ర్టంలో కుడా సూర్యదేవాలయం కలదు. శ్రీకాకుళం పట్టణానికి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో అరసవల్లి అనే గ్రామంలో సూర్యదేవాలయం కలదు. పూర్వం ఈ ప్రాంతాన్ని హర్షవల్లి అని పిలిచేవారు. కాల క్రమేణా అరసవల్లి గా ప్రసిద్ది చెందినది. ఈ దేవాలయం ప్రాచినమైనది. ఇక్కడ లభించిన శాసనాలను బట్టి ఈ దేవాలయం క్రి.శ. 7వ శతాబ్దంలో నిర్మించబడినదని తెలుస్తున్నది. క్రి.శ.17వ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం నవాబు పరిపాలన కిందకు వచ్చింది. "షేర్ మహమ్మద్ఖాన్ అనే అతడు ఈ ప్రాంతానికి సుబేదారుగా నియమించ బడ్డారు. అతడు ఇక్కడ దేవాలయాలను ఎన్నింటినో ధ్వంసం చేసాడు. అలా ద్వంసం చేయబడిన దేవాలయాలలో అరసవల్లి దేవాలయం కుడా ఒకటి. క్రి.శ. 1778 లో ఎలమంచిలి పుల్లాజి పంతులు అనే ఆయన పూర్వం నిర్మింపబడిన చోటనే మళ్ళీ ఆలయాన్ని పునరుద్దరించి విగ్రహాలని వెలికితీసి ఆ దేవాలయంలో ప్రతిష్టించాడు. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం అదే. ఇది ఇలా ఉండగా దీనికి సంబందించిన పురాణకధ కూడా ఉంది.

పూర్వం ద్వాపరయుగంలో శ్రీకృష్ణునీ అన్న అయిన బలరాముడు తీర్ధయాత్రలు చేస్తూ కళింగ దేశం వచ్చాడు. అప్పుడు అక్కడ కరువు తాండవిస్తున్నది. ప్రజలు చాల భాధలు పడుతున్నారు. వారు కరవు బారినుండి తమను కాపాడమని బలరాముని ప్రార్ధించారు. బలరాముడు వారిపై దయదలచి తన ఆయుధమైన నాగలితో భూమిని గ్రుచ్చి ఒక నీటిబుగ్గను పైకి తీసుకుని వచ్చారు. అదే ఇప్పుడు మనం నాగావళి అని పిలుస్తున్నది . బలరాముడు నాగావళి ఒడ్డున రుద్రకోటేశ్వర ఆలయ స్థాపన చేసి దానికి దేవతలను ఆహ్వానించాడు. దేవతలందరూ వచ్చారు కాని దేవేంద్రుడు మాత్రం వేళకు రాలేకపోయాడు. ఆయన అక్కడికి వచ్చేసరికి రాత్రి అయినది. ఆయన కోటేశ్వరస్వామిని దర్శించటానికి వెళ్ళగా నందీశ్వరుడు ఆయనను అడ్డుకున్నారు. ఇంద్రుడు కోపంతో దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ఎత్తగా, నందీశ్వరుడు తన కొమ్ములతో దేవేంద్రుడునీ విసిరికొట్టాడు. ఆ దెబ్బకు దేవేంద్రుడు అరసవల్లి సమీపంలో స్ప్రుహతప్పి పడిపోయాడు. అప్పడు సూర్యభగవానుడు ప్రత్యక్ష్యమై దేవేంద్రునితో "నా విగ్రహం ఇక్కడ ప్రతిష్టించి, ఆరాధించు" నీవు ఆరోగ్యవంతుడివి అవుతావు అని చెప్పి మాయమైనాడు. ఆయన చెప్పినట్లే దేవేంద్రుడు సుర్యనారాయణ స్వామిని అక్కడ ప్రతిష్టించి ఆ స్వామివారిని పూజించి ఆరోగ్యవంతుడై దేవలోకాన్ని చేరుకున్నాడు. సూర్యనారాయణస్వామీ తో పాటు ఆయన దేవరులైన ఉషా, పద్మినీ, చాయాదేవి విగ్రహాలను కుడా దర్శించవచ్చు.

భారతదేశములో సూర్యునికి సంబందించిన పండుగలు కూడా చాలా ప్రసిద్దిచెందివి. మకర సంక్రాంతిలో సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేసించే పుణ్యకాలం పంటలు అన్ని బాగా పండి రైతులు ధ్యానాన్ని ఇళ్ళకి చేర్చుకునే రోజు. చ్చాత్ సూర్యదేవుని మరియొక పండుగ. ఈ పండుగను సూర్యుని కుమారుడు అయిన కర్ణునీ ద్వారా మొదలై పండుగ. ఈ పండుగని గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్ ప్రాంత ప్రజలు జరుపుకుంటారు. సంబు దశమి తుర్పుప్రాంతము అయిన ఒరిస్సా ప్రాంత ప్రజలు జరుపుకుంటారు సంబునికి సూర్యదేవుని ప్రార్ధించటం వలన కుష్టివ్యాధి నయమైనది. 

హిందువులు మాఘశుద్ధ సప్తమి రోజు రథసప్తమి జరుపుకుంటారు. ఇతర మాసములోని సప్తమి తిథులు కన్నా మాఘమాసములోని సప్తమి తిథి చాల విశిష్టమైన పండుగ. సూర్యజయంతి, భాస్కరజయంతి కూడా ఈ రోజే. స్వామి వారి నిజరూప దర్శనం కలిగేది రథసప్తమి రోజే. సూర్యకిరణాలు అరసవల్లిలోని సూర్యనారాయణస్వామి వారి పాదాలకు నేరుగా సూర్యకిరణాలు పడతాయి. ఉత్తరాయణ దక్షిణాయనాలు మార్పు చెందే కాలంలో కుడా సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడతాయి. సూర్యనారాయణస్వామిని ఆరాధిస్తే ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ప్రతిరోజూ ఇక్కడ ఎందరో భక్తులు వచ్చి భక్తీ శ్రద్దలతో స్వామివారిని ఆరాధించి రోగావిముక్తులై వెళుతుంటారు.

రథసప్తమినాడు బంగారముగాని, వెండిగాని, రాగిగాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమనుంచి, పూజించి గురువునకు ఆ రథమును దానమీయవలెనని, ఆ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు వచ్చునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము. సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకము రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించువారు భారతీయులే.

సప్తాశ్వ రథమారూఢం ప్రచండ కశ్యపాత్మజమ్
శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ 

ఈ శ్లోకాన్ని జపిస్తూ స్వామివారినీ పూజించాలి .

ఈ రోజే ముత్తయిదువులు తమ నోములకు అంకురార్పణ చేస్తారు. చిత్రగుప్తుని నోము, ఉదయకుంకుమ నోము , పదహారఫలాల నోము, గ్రామకుంకుమ నోము ఈ రోజు మొదలుపెడతారు. ఈ రోజు ఎటువంటి పనులు తలపెట్టిన విజయం చేకూరుతుంది. ఆ రోజు ఉదయాన్నే పిల్లలు పెద్దలు నువ్వులనూనె రాసుకుని రేగిపళ్ళు, జిల్లేడు ఆకులు నెత్తిన పెట్టుకుని "ఓం సూర్య దేవాయ నమః" అని స్వామి వారిని మనసులో తలుచుకుని స్నానం ఆచరిస్తే కామ క్రోధాది గుణములు అన్ని తొలగుతాయి. జిల్లేడుకు రవి, ఆర్క ఆనే పేర్లు కూడా ఉన్నాయి. సూర్యని కోసం అర్చనలు చేస్తాం కాబట్టి జిల్లేడు ఆకులకు ప్రాధాన్యత వచ్చింది. తరువాత చిక్కుడు ఆకులను రధము ఆకారములో తయారుచేసి ఆవు పాలతో తయారుచేసిన పొంగలిని స్వామి వారికి నైవేద్యం పెట్టి ఆరగిస్తే ఆరోగ్యానికి మంచిది. చిక్కుడు ఆకులో ఉండే పసరు ఆరోగ్యానికి మంచిది. 

తిరుపతిలో కూడా శ్రీ వేంకటేశ్వరుని రధసప్తమి రోజున మొదట సుర్యప్రభ వాహనం మీద ఊరేగింపు చేస్తారు. చివరన చంద్రప్రభ వాహనం పై ఊరెగిస్తారు. మిగతా వాహనాలు హనుమద్వాహన, గరుడవాహన, పెదసేషవాహన, కల్పవృక్ష వాహన, స్వయంభూపాల వాహనములపై స్వామివారిని ఊరేగిస్తారు. చక్రస్నానం కూడా అదే రోజు చేస్తారు.ఒక్క రోజు బ్రహ్మోత్సవాన్ని ఎంతో కన్నులపండుగగా జరుపుతారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని కనులారా దర్శించుకుని ఆనందపడతారు.

సూర్యుడు ఆరోగ్య ప్రదాత, యోగాసనం, ప్రాణాయామం మరియు చక్రద్యానం కూడుకొని చేసే సంపూర్ణసాధనే సుర్యనమస్కారములు. బ్రహ్మముహుర్తంలో చేస్తే మంచి ఫలితాలని ఇస్తాయి. సూర్య నమస్కారములలో 12 మంత్రాలు ఉన్నాయి. 12 మంత్రాలని జపిస్తూ సుర్యనమస్కారములు చేస్తే ఆరోగ్యానికి మంచిది. సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖముగా నిలబడి సుర్యనమస్కారములు చేయాలి. సూర్య నమస్కారముల వలన ఊపిరితిత్తులు, నాడీమండలం, జీర్ణశక్తి మొదలయిన అవయవాలన్నింటికీ రక్తప్రసరణ సక్రమంగా జరిగి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కళ్ళ సమస్యలు ఉన్నవారు సూర్యదేవుని ఆరాధిస్తే సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం ఆదిత్య హృదయం సుర్యభగావానునికి సంబదించిన స్తోత్రం. రామాయణం యుద్దకాండలో శ్రీరాముడు అలసట పొందినపుడు అగస్త్యమహర్షి యుద్దస్థలమునకు వచ్చి ఆదిత్య హృదయం ఆనే మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశం అయిన పిమ్మట శ్రీరాముడు రావణాసురుడిని సంహరించాడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం.


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML