What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 24 January 2016

వరంగల్ జిల్లాలోని ప్రముఖమైన శ్రీ సోమేశ్వర లక్ష్మినరసింహ స్వామివారి దేవాలయం.



వరంగల్ జిల్లాలోని ప్రముఖమైన శ్రీ సోమేశ్వర లక్ష్మినరసింహ స్వామివారి దేవాలయం. ఈ దేవాలయం వరంగల్ నుండి సుమారు 50 kmల దూరంలో స్టేషన్ఘన్పుర్కి దగ్గర వున్న దేవాలయం.

ఇది చాల మహిమన్మితమైన క్షేత్రం
పూర్వం 1200, 1300 ఏళ్ల క్రితం ఈ పాలకుర్తి ప్రదేశంలో ఋషులు తపస్సు చేసేవారనీ, వారి తపస్సుకు మెచ్చి సోమేశ్వరుడు ప్రత్యక్ష్యమై వారి కోరికపై ఇక్కడే స్వయంభూగా వెలిశాడనీ చెబుతారు. ఇంకొక కథనం ప్రకారం.. సప్త ఋషుల కోరికపై సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని అంటుంటారు. ఈ స్వామి కరుణకి ఇంకో నిదర్శనం కూడా వుంది. అదేమిటంటే..


పూర్వం.. అపరభక్తురాలైన ఓ వృధ్ధురాలు స్వామీకి ప్రదక్షిణ చెయ్యటానికి ఈ ప్రదేశానికి వచ్చేది. కానీ.. ఆలయం కొండపైన వుండటం కారణంగా ప్రదక్షిణ చేసేందుకు వీలుగా మార్గం లేకపోయింది. దీంతో ఆమె కొండ చుట్టూ తిరిగి వచ్చేది. వయస్సు మీద పడేకొద్ది ఆవిడ కొండ చుట్టూ తిరగలేక ప్రయాస పడుతుంటే.. పరమేశ్వరుడు తన ఆలయం వెనుక కొండ చీల్చి, ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పరించాడు. అప్పటినుంచీ స్వామి ప్రదక్షిణ ఆ మార్గంలోనే చేస్తారు. భక్తులు భక్తిగా ఆ మార్గంలో వెళ్తే ఎంత లావయినవాళ్ళయినా సునాయాసంగా వెళ్తారనీ, అలాకాకుండా అపరిశుభ్రంగా వెళ్తే తేనెటీగలు కుట్టి, కుట్టి తరుముతాయనీ అక్కడివారి నమ్మకం. అక్కడ తేనెపట్లు చాలా వున్నాయి. ఆ తేనెటీగలు ఈ ప్రాంతానికి రక్షకభటుల్లా వుంటాయని నమ్ముతారు.

ఈ ఆలయానికి మహత్యం చాలా ఎక్కువ అని భక్తుల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే సుఖ సంతోషాలు, సిరిసంపదలేకాక జ్ఞాన సంపద లభిస్తుందని ప్రఖ్యాతి. సోమేశ్వరస్వామిని దర్శించి, పూజలు చేసి, పక్కనే ఇంకొక గుహలో వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారినికుడా
వుంటారు.

ఇక్కడ ఇద్దరు స్వయంవ్యక్తమైన వారె.

అందుకే ఈ క్షేత్రాన్ని హరి హర క్షేత్రం అంటారు.

అంతే కాదు మహా కవులు బొమ్మెర పోతన, పాల్కుర్కి సోమనాదుడు ఇక్కడి వారె.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML