ముదిచూర్ ఆలయం
చెన్నైలోని తామ్రాకు దగ్గరలో ఈ హరిహర క్షేత్రం ఉంది. శ్రీ విద్యాంబికా సమేత భీమేశ్వర స్వామి ఇక్కడ కొలువయ్యాడు. దాదాపు 1300 ఏళ్ళ కిందట కామేశ్వరన్ అనే శివభక్తుడు ఇక్కడి స్వయంభూ లింగాన్ని పూజించినట్లు ఆలయచరిత్ర మనకు తెలియజేస్తోంది.
కామేశ్వరన్ అనే శివభక్తుడు అదే గ్రామానికి చెందిన విశ్వం అనే అతడి కూతురు వాసుకిని ప్రేమించాడు. వారి పెళ్ళికి విశ్వం అంగీకరించలేదు. వివాహం కోసం కామేశ్వరన్ పరమేశ్వరుణ్ని శరణు వేడాడు. అంతట పరమేశ్వరుడు విశ్వం కలలో కనిపించి... వారిద్దరి వివాహం జరిపించమని ఆజ్ఞాపించాడు. అలా విశ్వం వారిద్దరికీ వివాహం చేశాడు.
వివాహం కాని వారు ఇక్కడ ఉండే చెట్టుకి పసుపు రంగు తాడు కట్టి, స్వామికి మొక్కుకుంటారు. ప్రతి తాడుకు ఓ నంబర్ ఇస్తారు. మొక్కున్న వారు వివాహం అయిన వెంటనే... మళ్లీ ఆలయానికి వెళ్ళి, ఆ తాడును విప్పి, మళ్లీ పూజ చేసి రావాలి.
శుభకార్యాలకు, అవసరాలకు తగినంత ధనం పొందడానికి
ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తులసి దళాలతో సహస్రనామావళి పూజ చేయాలి.
వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అవుతుంటే, పరిష్కారం కోసం
ప్రతి గురువారం శనగల దండ గురు గ్రహానికి వేసి, 108 ప్రదక్షిణలు చేయాలి.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment