What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Showing posts with label పురాణములు. Show all posts
Showing posts with label పురాణములు. Show all posts

Friday, 13 March 2015

శివ మహా పురాణం, శూత మహర్షి ఉవాచ



శ్రీ లలితాంబికగా, ఆదిదేవి తపస్సు చేసిన ప్రదేశం నైమి శారణ్యం. కృతయుగం నాటి క్షేత్రస్థలి ఇది. ఒకానొకప్పుడు ఋషు లందరూ కలిసి తమకొక దివ్యమైన తపోస్థలిని ప్రసాదించమని బ్రహ్మను కోరారు. బ్రహ్మ చూపించబోయే ఆ దివ్యస్థలం సర్వోపద్రవాలకు అతీతం గానూ, దుర్జన దుర్జయముగానూ ఉండాలని అభ్యర్థించారు. శ్రీమన్నారాయణుని స్తుతించిన విధాత, ఒక చక్రాయుధాన్ని సృష్టించి దాని భ్రమణం ఎక్కడ నిలిచిపోతే అక్కడ తపస్సుకు అనుకూలమైన స్థలం ఉంటుందని, దానిని అనుసరిస్తూ వెళ్లవలసిందని ఆనతినిచ్చాడు. అది లోకాలన్నీ తిరిగి భూలోకంలోని ఒక ప్రదేశంలో ఒక రాక్షసుని నిమేష మాత్రంలో వధించి, ఆ చక్రనేమి అక్కడ నిలిచిపోయింది. నేమి నిలిచిన ఆ ప్రదేశమే నైమిశారణ్య ప్రాంతం.ఆ స్థలంలోనే ఆదిదేవి తపస్సు చేసినదని గ్రహించిన ఋషిగణం యావత్తూ విధాతకు స్తోత్రావళు లర్పించి మహదానందంగా నైమిశారణ్యప్రవేశం చేశారు.


సుమారు ఎనభై ఎనిమిది వేలమంది ఋషులు అక్కడ తపో వాటికలు నిర్మించుకుని లోక హితార్థం యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తుండగా ఒకనాడు ...

మహాపౌరాణికులయిన సూతమహర్షి అక్కడకు వేంచేశారు. రోమహర్షణ మహర్షి పుత్రుడూ, శ్రీ శుకయోగీంద్రుల సహపాఠీ, వేదవ్యాస మునీంద్రుల ప్రియశిష్యుడూ ఐన సూతముని రాక, నైమి శారణ్యమునందు వసించుచున్న శౌనకాది ఋషులందరికీ ఆనందం కలిగించింది.

మునిగణమంతా, సూతమహర్షి కెదురేగి స్వాగతించి ఆర్ఘ్యపాద్యాదులిచ్చి, సత్కరించి అనంతరం - ఆయనను పరివేష్ఠించి కూర్చున్న మీదట శౌనకుడీ విధంగా ప్రస్తావించాడు.

"మహాత్మా! మా యందుగల అపార కరుణా కటాక్షముచేత ఈ నైమిశారణ్యస్థలిని పావనం చేశావు. మాకు మీ దర్శన భాగ్యం లభించే ప్రతీసారీ పౌరాణిక గాధావళి విన వేడుక కలగడం - తాము అభిభాషించి అనుగ్రహించడం అనూచారంగా వస్తున్నది. ఎన్ని గాధలనైనా ధర్మ సూక్ష్మ సహితంగా వివరించగల 'అగాధమౌ జలనిధి ' వంటి తాము మాపై దయ ప్రసరించి, దివ్యపురాణమేదైనా సెలవీయ వలసిందిగా మా కోరిక" అని ఋషులందరి తరుపునా అభ్యర్థించాడు.

'కలి ప్రభావ పీడితులై నానాక్లేశాలు అనుభవిస్తున్న నరులను సైతం ఉద్ధరించగల ఏకైక పురాణం ఏది?' అని అర్థనిమీలిత నేత్రుడై, మనసులోనే త్రినేత్రుని అవలోకించిన సూతపౌరాణికునకు సాక్షాత్తు శ్రీ మహాశివుని పురాణమే ఆ క్షణాన వృదయ ఫలకంపై స్పురించింది.

చిరునవ్వుతోనూ, సదయాదృక్కులతోనూ తనచుట్టూ చేరివున్న మునిజన బృందాన్ని సమ్మోహనకరంగా చూశాడు సూత మహర్షి.

"ఇంతవరకు మీరు విన్న పౌరాణిక గాథలన్నిటికంటే శ్రేష్ఠమైనదీ, జ్ఞానయోగ మోక్ష కారకమైనదీ, జన్మజన్మాంతర పుణ్యఫల విశేషంచేత మాత్రమే శ్రవణార్హమైనదీ అయినట్టి శ్రీ శివమహాపురాణా గాధ సవిస్తరంగా మీకు చెప్ప ఉత్సాహంగా ఉంది! అంతా శివేచ్చ!" అంటు మొట్టమొదట తమ గురువైన వ్యాసభగవానుని ధ్యానించి, ఆయన కృతమైన రుద్ర స్తుతితో, ఈ మహాపురాణం ప్రారంభించాడు సూత పౌరాణికుడు.

వ్యాసోక్త రుద్ర స్తుతి -

నమో దేవాయ మహతే - దేవదేవాయ - శూలినే!
త్ర్యంబకాయ త్రినేత్రాయ - యోగినాంపతయే నమః!!

నమోస్తు దేవదేవాయ - మహాదేవాయ వేధసే!
శంభవే స్థాణవే నిత్యం - శివాయ పరమాత్మనే!!

నమస్సోమాయ రుద్రాయ - మహాగ్రాసాయ హేతవే!
ప్రపద్యేహం విరూపాక్షం - శరణ్యం బ్రహ్మచారిణమ్!!

మహాదేవం మహాయోగ - మీశానం త్వంబికాపతిం!
యోగినం యోగదాతారం - యోగ మాయా సమావృతం!!

యోగినాం గురు మాచార్యం - యోగగమ్యం సనాతనం!
సంసారతారణం రుద్రం - బ్రహ్మణాం బ్రాహ్మణోధిపం!!

శాశ్వతం సర్వగ్o శాంతం - బ్రహ్మాణం బ్రాహ్మణప్రియం!
కపర్దినం కళామూర్తి - మమూర్తి మమరేశ్వరమ్!!

ఏక మూర్తిం మహామూర్తిం - వేదవేద్యం సతాం గతిమ్!
నీలకంఠం విశ్వమూర్తిం - వ్యాపినం విశ్వరేతసం!!

కాలాగ్నిం కాలదహనం - కామినం కామ నాశనం!
నమామి గిరీశం దేవం - చంద్రావయవభూషణం!!

త్రిలోచనం లేలిహాస - మాదిత్యం పరమేష్ఠినం!
ఉగ్రం పశుపతిం భీమం - భాస్కరం తమసః పరమ్!!

సూత మహర్షి ఈ విధంగా స్తోత్రం చేసిన అనంతరం, ఇలా చెప్పసాగాడు. " మునివరేణ్యులారా! నేను పఠించిన ఈ స్తోత్రములోనే శివుని అష్టవిధ రూపములు అంతర్గతమై ఉన్నాయి. వాటి విశిష్టత మీకు వివరిస్తాను. శ్రద్ధాళువులై వినండి!
Read More

శివ మహా పురాణం, సృష్టి క్రమం



మహా ప్రళయ కాలంలో జగత్తులన్నీ నశిస్తాయి. అంతా జల మయం. ఒకే సముద్రంలా తోచే అట్టి అపార జలరాశి ఆవరించి ఉండగా - సహస్ర శీర్ష, సహస్ర కర పాద రూప సహితుడై విరాట్పురుషుడు సత్వ గుణ ప్రేరితుడై సమాధి స్థితి యందు విశ్రాంతి తీసు కుంటాడు. ఆ తరుణ మందు - భూనభోంతరాళములందు ఎటు చూసినా చిమ్మ చీకటి వ్యాపించి ఉంటుంది.


సృష్టి, స్థితి, లయాలకు మూల భూతుడైన ఆది దేవుడొక్కడే వటపత్ర శాయిగా దేదీప్య మానంగా ప్రకాశిస్తూ, తెలివి రాగా నిద్ర లేచి ఈ ప్రపంచపు దురవస్థను చూచి విచారిస్తాడు. రజోగుణ ప్రభావం చేత జ్ఞానాన్ని ఉద్దీపింప జేస్తాడు. అదే పునః సృష్టికి సంకల్పం వంటిది. బ్రహ్మగా, నారాయణుడిగా, రుద్రుడిగా అనేక నామాలతో సంకీర్తింప బడే ఆది విరాట్‌ స్వరూపుడే,జ్ఞానం ద్వారా అహంకారాన్ని, దాన్నుండి మనస్సును, దాని వలన పంచ భూతములైన పృథి వ్యాపస్తేజో వాయు రాకాశాల్ని పుట్టిస్తాడు.

వీటిలో ఆకాశం వల్ల శబ్దం, వాయువు వల్ల స్పర్శ, అగ్ని వల్ల రూపం, జలము వల్ల రసం, భూమి వల్ల గంధం జన్మిస్తాయి. ఆ తదుపరి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే పంచ ప్రాణాలు; సత్వ, రజ స్తమం గుణాలనే త్రిగుణాలు ఉద్భవిస్తాయి. ఇందు నుండి సత్వ గుణ ప్రతినిధిగా విష్ణువు, రజో గుణ ప్రతినిధిగా బ్రహ్మ, తమో గుణ ప్రతినిధిగా ఈశ్వరుడు వెలుగొందుతారు.

వీరిలో మహేశ్వరుడు సనాతనుడు, నిరంజనుడు, అరూపుడు, ఆది మధ్యాంత రహితుడు. సృష్ట్యంతాన - తమో గుణ ప్రాబల్యం వల్ల సంహార కార్యానికి ఇతడే కర్త అవుతాడు. అనగా - మరలా ప్రళయ కాల జల రాశికి ఆధార భూతుడౌతాడు. కనుక పరమ శివుడను పేర ఇతడు చిరస్థాయిగా నుండువాడని అర్థం!

"సూక్ష్మంగా తరచి చూడగా పరమ శివుడే పైన చెప్పిన సమస్తం సృష్టించు వాడు. అనగా స్వయంభువు కూడా అతడే అవుతున్నాడు.

తన మహేశ్వరాంశ తో సహా బ్రహ్మ, విష్ణ్యంశ లను కూడా లయ స్థితి కి తెచ్చే ఈ పరమ శివుడు 'ఆది విరాట్పురుషు' డనుటకు సందేహమేమున్నది ? బ్రహ్మ కల్పాంతకాలంలో యోగనిద్ర చెందేది ఇతడే! తిరిగి ఈ సృష్టి లీలా వినోదానికి కారణ భూతుడూ ఇతడే! మహర్లోకంలో ఉన్న దివిజ మహర్షులంతా ఈ లీల లను స్వయంగా పరికింప శక్తి కలిగిన వారు. వారు తప్ప ఇతరులెవ్వరునూ లేరు.

బ్రహ్మగా సృష్టి ఆరంభించి, రాత్రి అయ్యే వరకు ఆ సృష్టి లోనే బ్రహ్మ గడిపే కాలం - 'ఒక కల్ప కాలము'. అటు వంటిదే రాత్రి విశ్రాంతితో గడిపే కాలం - మరొక కల్పకాలం. కనుక ఇటువంటి రెండు కల్పములు (ఒక పగలు - ఒక రాత్రి) బ్రహ్మకు ఒక రోజు.

ఇటువంటి ఒక రోజు జరగాలంటే, 14 మన్వంతరాలు గడవాలి. (మన్వంతరాలు 14. అవి: స్వాయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుస, వైవస్వత, సూర్యసావర్ణి, అగ్నిసావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్రసావర్ణి, దక్షసావర్ణి, రౌచ్య, భౌచ్య అనేవి.

వీటిలో ఒక్క మన్వంతరం గడవాలీ అంటే - మానవుల లెక్కల ప్రకారం ఏడు యుగాలు గడవాలి. (అవి: కృత, త్రేతా, ద్వాపర, కలి అనే 4 యుగాలు. ఈ నాల్గు యుగాలూ మరలా అవే ఆవృతమవుతూ ఉంటాయి.) ఒక్కొక్క యుగం లోనూ కొన్ని తరాలకు తరాల జీవులు జనించడం - నశించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రకారం మానవుల జీవిత కాలం అతి స్వల్పం! కనుక ఈ స్వల్ప కాలాన్నే సక్రమ మైన రీతిలో మలచు కొని, దుస్తరంబైన ఈ మాయామయ సంసారమనే సాగరం నుండి విముక్తి పొందాలి. ఈ ప్రపంచం లోనే మళ్లీ జన్మిస్తూ - మరణిస్తూ ఉండక, ధర్మ ప్రవర్తనతో, జ్ఞాన సముపార్జనతో ఉత్తమ జీవితం గడపడమే విముక్తి సాధన. ధర్మం నాలుగు పాదాలతో నడయాడుతూ ఉంటుంది అవే సత్యము, అహింస, శాంతమూ, దయ. కృత యుగాంతానికి సత్యం నశించినది. త్రేతాయుగం అంత్యకాలం నాటికి అహింస అణిగింది. ద్వాపర యుగం ముగిసే సరికి శాంతం అంతరించింది. ప్రస్తుత కలి యుగమున దయ అంతరించే సూచనలున్నవి. ఆయా యుగాలు ధర్మాలు కోల్పోయాక వచ్చేది ప్రళయం. ఇక పునః పునః సృష్టి!.. ఇదీ సృష్టి క్రమం. ఇదొక చక్రం వలె నిరంతరం ఆవృతమయ్యే విధానం. అందుకే ఆది మధ్య అంతం లేని నిరంతర భ్రమణం. - 'కాలం' యొక్క స్వభావం.

ఈ కాలము అనేది మూడు విధాలు. అవి:- మానుష మానము, దేవ మానము, బ్రహ్మ మానము.

పైన చెప్పిన కల్పముల వంటివి బ్రహ్మ మానం. (ప్రస్తుతము మానుష మానం ప్రకారం - 28వ మహాయుగం లోని 5102వ కలి యుగం నడుస్తున్నది. ప్రస్తుతము నడుస్తున్నది వైవస్వత మన్వంతరం.

ఈ కాల ప్రశస్తి గురించిన ప్రస్తావన తో ప్రథమమున చెప్పినట్లు - ఒకానొక కల్ప కాల ప్రారంభ సమయమున, బ్రహ్మదేవుడు తన వంటి మహా తేజస్వి యైన కుమారుని ప్రభవింప జేయ సంకల్పించాడు.

అంతే!...

సంకల్పించినదే తడవుగా, తేజో పుంజ మనదగిన ఓ గొప్ప కాంతితో నీల లోహిత వర్ణుడైన ఒక కుమారుడు బ్రహ్మ తొడపై ప్రత్యక్షమై, తనకో పేరు కావాలని ఏడవ సాగాడు. రుద్రుడని నామ కరణం చేశాడు బ్రహ్మ. తనకొక్క పేరు చాలదన్నాడు ఆ బాలుడు. ఈసారి భవుడని పేరు పెట్టాడు. ఇంకా ఆ బాలకుడు ఊరకొనక పోవడం వల్ల శివుడు, పశుపతి, ఈశ్వరుడు, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు అనే మొత్తం ఎనిమిది పేర్లు పెట్టి సంతుష్టుని చేశాడు బ్రహ్మ.

"నన్ను అష్టమూర్తిని చేశావు బాగానే ఉంది. మరి వేటికి స్థాన శరీర విశేషాలు, ఉనికి పట్లు, పత్నీ పుత్రులు... ఇన్ని హంగులు ఏ విధంగా కూర్చావో చెప్పు!" అని అడిగాడు - పరమ శివాంశ గల ఆ బాలుడు.
Read More

శివ మహా పురాణం, శివుని అష్ట మూర్తులు



బ్రహ్మ దేవుడు అతన్ని "నీవు సర్వ భూత స్వరూపుడవు." అని అభినందించి, "నిన్ను వరుసగా రుద్ర నామ ధేయము నుంచి మహా దేవ నామము వరకు నేను ఎలా సృష్టి ఊహ చేశానో చెప్తున్నాను! విను" అంటూ ఇలా వివరించాడు.


1. రుద్రుడు: "యాభి రాదిత్య స్తపతి రశ్మిభి |
స్తాభిః పర్జన్యో వర్షతి ||"

అనే వేద ప్రామాణికాన్ననుసరించి నీవు సూర్య స్థానంలో ఉందువు. సూర్యుడే సర్వ చరాచర జగత్తుకు ఆత్మ స్వరూపుడు. (ఆదిత్య హృదయం) జగత్కారణ కర్త. సస్యానుకాల వర్ష కారకుడు. 'సూర్య ఆత్మా జగత సస్థుషశ్చ' అనే స్మృతి వాక్యానుసారం ఈ జీవజాలాన్నంతటినీ ప్రభావితం చేయ గలడు. కనుక - రూపం రౌద్రం. భార్య సువర్చల. కొడుకు శని.

2. భవుడు: 'యోప్సునావం ప్రతిష్టితాం వవేద - ప్రత్యేవతిష్ఠతి' అని శ్రుతి లోకాలన్నీ నీళ్లలో ఓడల్లా తేలు తున్నవని గ్రహించే వాడే భవుడు. కనుక - శరీరం నారము. (అపో నారా ఇతి ప్రోక్తాః!) నీటి యందు నీ ఉనికి పట్టు గలదు. ఈ మూర్తిలో నీకు భార్యా పుత్రులు ఉష - ఉశనులు

3. శివుడు:
శర్వుడు అనే నామాంతరంతో గూడ పిలువ బడతావు. శరీరంలో ఎముకలు ఎట్లా నిలబెట్ట బడి ఆధారభూతమై నిలుస్తాయో, ఆ విధంగా ఈ భూమి కూడా నివసించడానికి వీలు కల్పించేలా నిలబెట్టబడి ఉంది. కనుక ఈ మూర్తి యందు నీ ఉనికి పట్టు భూమి. శరీరము - శార్వము. భార్య - వికేశి. కొడుకు - అంగారకుడు.

4. పశుపతి : "అహం వైశ్వానరో భూత్వా |
ప్రాణి్నాం దేహ మాశ్రితః ||"
అని గీతా ప్రవచనం.
అన్ని జీవుల శరీరం లోనూ జఠరాగ్ని అనేది జీర్ణ క్రియ కు దోహద కారి. కనుక ఈ మూర్తి లో నీ స్థానం అగ్ని. శరీరం - వైశ్వానరం. భార్య - స్వాహా దేవి. కొడుకు - స్కందుడు.
5. ఈశ్వరుడు : ప్రాణుల శరీరం లోని ప్రాణ, అపాన,వ్యాన,ఉదాన,సమాన అనే నామాంతరంతో వాయువుల రూపంలో ఉండి మానవుల్ని జీవింప చేస్తావు. కనుక ఈ మూర్తి యందు నీ స్థా నం- వాయువు. 'ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వరస్సర్వ భూతానాం' అని శ్రుతి. కనుక శరీరం - ఈశానం. భార్య - శివ. కొడుకు - మనోజవుడు.

6. భీముడు : ఈ మూర్తిలో నీ స్థానం ఆకాశం. దేహం లోని రంధ్రాలలో (బయలు ప్రదేశం) వ్యాపించి ఉంటావు. నీ శరీరం భీమము. దశ దిశలు భార్యలు, స్వర్గుడు కొడుకు.
7. ఉగ్రుడు : యజమానుడైన గృహస్థు రూపంలో నీవు ఈ మూర్తి యందు వశించెదవు. యజ్ఞదీక్ష యందుండు యజమానుడు - నీకు ఉనికి పట్టు. దేవతలను సర్వాంతర్యామిని యజ్ఞంతో సంతుష్టి చేయు వాడవు. నీ శరీరం ఈ మూర్తిలో ఉగ్రము. భార్య దీక్ష. కొడుకు సంతానుడు.

8. మహా దేవుడు : "సోమ ఓషధీనా మధిపతిః" అని శ్రుతి వాక్యము.కనుక నీ స్థానము చంద్రుడు. ఈ మూర్తిలో ఓషధులన్నిటికీ అధిపతివై, వాటిని వృద్ధి చేసి ప్రాణులకు జీవ ప్రమాణ వృద్ధికి దాతవు కూడా అయ్యెదవు. కనుక నీ శరీరము - చాంద్రమసం. భార్య - రోహిణి. కొడుకు - బుధుడు
- ఈ ప్రకారము శివుని అష్టమూర్తి నిరూపణము జరిగినది. ఇదంతయూ సృష్టి వైచిత్ర్యమే! శివుని అష్ట మూర్తులను, ఆయా మూర్తి తత్వాలను గ్రహించిన వాడు ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రులవు తారు.

అంతే కాదు! ...
"శివనామాష్టకం (శివుని ఎనిమిది పేర్లు) కూడా ఎంతో పుణ్య ఫల దాయకం! ఆ పేర్లు ఇవి: శివాయ నమః, రుద్రాయ నమః, మహేశ్వరాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, (ఈ ఐదు పంచ సాధకులకు ప్రియమైనవి). సంసార భిషజే నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మాయ నమః (ఈ మూడు మోక్ష సాధకులకు శుద్ధ నివృత్తి కారకాలు.) ఉభయ తారక మైన ఈ నామాష్టకం విశిష్టత ఇంతింతని చెప్ప బడనిది. కనుకనే నేను ఈ శివ పురాణం మీకు వినిపింప ప్రారంభిస్తూ - రుద్ర స్తుతి పఠించడం జరిగింది." అని చెప్పాడు సూతుడు.
మహర్షులంతా కూడా సూత మహాముని ఆదే్శానుసారం రుద్ర స్తుతి చేశారు.
అనంతరం ...
తిరిగి సూత పౌరాణికుడీ విధంగా సెలవిచ్చాడు -
"యోవై భ్రహ్మాణం విదధాతి - యో దేవానాం
ప్రథమం పురస్తాత్‌ - విశ్వాధిపో రుద్రో మహర్షిః " అని శ్రుతి
దీని ప్రకారం - ఈ వస్తు (గుణ, రూప, రస, గంధ, స్పర్శాత్మక మైన )సమస్తమూ రుద్రుని సృష్టి. బ్రహ్మాదులందరూ అమృత రూపుడిగా ఆరాధించే ఆ పరమేశ్వరుడు అచలుడు. ఆనంద మూర్తి. ఆదిత్య వర్ణుడు, సర్వాధిపతి, తిమిరాతీతుడు. సర్వుడు.

"ఇట్టి పరమేశ్వరుని కన్న పెద్ద గానీ - చిన్న గానీ - సాటి గానీ ఎవరూ లేరు. సర్వ ప్రాణుల యందు - అణువణువు నందు నిండిన స్వయం ప్రకాశక సదానంద మూర్తి. మోక్షార్ధి అయిన వాడు ఆశ్రయించ దగ్గ ఏకైక విరాడ్రూపుడు ఆ పరమేశ్వరుడొక్కడే! శివ తత్వ జిజ్ఞాసువులకు సైతం అందినట్టే అంది, అగోచరమయ్యే మహా మూర్తి మంతమైన తత్వం ఆయనది!" అని చెప్తూన్నంత లోనే "మహానుభావా! మరి మాకొక్క ధర్మ సందేహము. శివ తత్వము తెలియుట ఎట్లు ? ఇతః పూర్వ మెవరైనా అట్టి ప్రయత్నము చేసిన వారున్నారా ? ఉంటే ఏ విధముగా చేసిరి ?" అని ప్రశ్నించారు కొందరు మునీద్రులు
శివ తత్వార్థి యైన నారదుడు :
"నేను ఇప్పుడు ప్రస్తావించ బోవు విషయం సరిగ్గా అదే ! శివ తత్వం గ్రహించే నిమిత్తం ఎందరో ప్రయత్నించారు. అట్టి వారిలో సాక్షాత్తు నారద మునీంద్రులొకరు" అన్నాడు సూతుడు.

"నారదుల వారు లేని పురాణం లేదు గదా! ఆ లోకోక్తి నిజమయ్యేలా ఉన్నదే!" అంటూన్న శౌనకుని వంక చిద్విలాసంగా చూచి, పురాణ కథా శ్రవణం కొన సాగించాడు సూత మహర్షి -
"పూర్వం ఒక కల్ప కాలం వెనుక ఎన్నడో - నారద మునివరేణ్యులు శివ తత్వ జిజ్ఞాసులై అఖండమైన తపస్సు చేశారు. అది ఎంత తీవ్ర తరమైనదీ అంటే ... ఆ తపోగ్రతకు ఎక్కడెక్కడి లోకాలూ జ్వలించి పోసాగాయి. ఇంద్రుడు వెంటనే మన్మథుని రప్పించి, నారద తపస్సుకు విఘాతం కలిగించ వలసిందిగా కోరాడు. 'నారదుడాజన్మ బ్రహ్మచారి. ఆయన మామూలు మునీశ్వరుడు కాడు. ఈ అనగుని బారికి లొంగడు' అని తన అశక్తత వెల్లడించాడు మన్మథుడు. నీ ప్రయత్నం శక్తి వంచనలేకుండా చేయమని చెప్పాడు ఇంద్రుడు. తప్పని సరైన తరుణంలో - వసంత కాలాన్నీ, సుఖ - పిక - కీర - సారికాది గుణాల్నీ, చెరకు వింటినీ, పూల బాణాల్నీ తన మొత్తం సంబారాలనూ వెంట నిడుకొని బయల్దేరాడు మన్మథుడు. నారదుడు తపస్సు చేస్తున్న ప్రదేశానికి వచ్చాడు. తీరా చూస్తే అది ఒకప్పుడు తాను శివ నేత్రాగ్ని జ్వాలలకు దగ్ధమైన చోటు అని తెలుసు కున్నాడు. ప్రస్తుతం నారదుడు అంతటి ముక్కంటి గురించే తపస్సు చేస్తున్నాడు. తనకు మళ్లీ ఏ ఉపద్రవం రానున్నదో! ఇటు ఇంద్రుని ఆజ్ఞను ధిక్కరించనూ లేక, అటు మరో సారి, శివాగ్రహానికి గురి కావల్సి వస్తుందేమో అనే శంక మన్మథుని మనస్సును మధిస్తుండగా, అన్య మనస్కం గానే నారద తపో భంగానికి సిద్ధ మయ్యాడు." సూతుడీ విధంగా చెప్పగానే శౌనకాది మునులందరూ "పౌరాణిక కథా కథన శ్రేష్ఠా! ఈ మన్మధుని వృత్తాంతమేమి ? గతమున అతడెట్లు భస్మ మయ్యెను ?" అని అడిగారు. వారి కోరికపై సూతుడు కామ దహన ఘట్టాన్ని చెప్పడం ప్రారంభించాడు -
Read More

శివ మహా పురాణం, కామ దహన ఘట్టం



"ఒకప్పుడు తారకాసురుడనే రాక్షసుని వల్ల నానా కష్టము లు అనుభవించుచున్న దేవతలంతా బ్రహ్మవద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఆయన వారినందరినీ తోడ్కుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళగా - ఈశ్వరుని తపస్సు భగ్నం చేస్తేగాని, దీనికి మార్గం లేదన్నాడు. వివరించమన్నారు దేవతలు. తారకాసురుని సంహరించాలంటే, అది శివాంశతో కూడినట్టి ఆయన పుత్రుని వల్లనే సాధ్యం! ప్రస్తుతం బ్రహ్మచర్య దీక్షతో ఉగ్రతప మాచరిస్తున్న శూలి మొక్కోపి. ఆయన సమాధి స్థితి నండి బైటికి వస్తేనేగాని, శరీర స్పృహ కలుగదు. అది కలిగితే తప్ప - ఆయన కామపరవశుడు కాలేడు. అది జరిగితే గానీ - శివునికి వివాహప్రయత్నం గానీ, తద్వారా కుమారజననం గాని సాధ్యం కావు. ఇలా ఒకదాని వెంట ఒకటిగా జరగవలసిన ఈ కార్యక్రమాలన్నిటికీ ఒకే ఒక ఉపాయమున్నది. మొట్టమొదట శివ తపోదీక్షకు భంగం కలగాలి. దానికి సమర్థుడు నా పుత్రుడైన మన్మథుడు మాత్రమే! సమస్త జీవరాసులకు కామావేశము కలిగించగల కందర్పుని దర్శించి, మీ కార్యాన్ని సానుకూల పరుచుకోండని వివరించాడు విష్ణువు.


దేవతలంతా పంచబాణుని బ్రతిమాలి, పరమశివుని దీక్షకు భంగం కలిగించమని వేడుకున్నారు. నిటలాక్షుడు అగ్నినే మూడోకన్నుగా ధరించినవాడు కనుక, పుష్పబాణాలు ప్రయోగించేటప్పుడు చాటుగా ఉండి - శరసంధానం చేయవలసిందని సలహాలూ, జగ్రత్తలూ చెప్పి పంపారు.

పంచశరుడు మలయమారుతుని, జయంత; వసంతుల్ని వెంట బెట్టుకుని, శివుని తపస్సు చాలించేలా చేయడానికి సన్నద్ధుడయ్యాడు.

కేవలం ఒక మహాత్కార్యసిద్ధి కోసం, రూపొందించిన ఈ ప్రయత్నంలో - అవసరార్థం అక్కడ ఆకాలంలో అడుగుపెట్టింది వసంతం. అదంతా మన్మథుని మిత్రుడైన వసంతుడు చలవే! పిల్లగాలులు రువ్వేపని మలయమారుతుడు చేపట్టాడు. వసంతానికి ప్రతిస్పందించే జీవులు, ప్రాణులను అక్కడకు చేర్చేపని జయంతుడు తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు.

మన్మథుడు చాటుగా ఉండి, పుష్పబాణాలను ప్రయోగించాడు. అవి తగిలి శివునికి తపోభంగం జరిగింది. నలుదిక్కులా కలయజూసే సరికి, ఓ చెట్టుప్రక్కగా నక్కి నిలుచున్న పుష్పశరుడు కనిపించాడు. ఫాలనేత్రం పరమవేగాన తెరుచుకున్నది. శివుని కంటి మంటలకు ఆహుతయ్యాడు కాముడు.

కీడు శంకించిన కాముని సతి, రతీదేవి గోడు గోడున ఏడుస్తూ శివుని శరణువేడింది. పెక్కురీతుల ప్రార్థించింది. శివుడామెను కరుణించి "ఇక పై నీ పతి నీకు మాత్రమే సశరీరుడిగా దర్శనమిస్తాడు. మిగిలిన దేవ దానవ యక్ష రాక్షస మానవ మునివరేణ్య గణాలకు ఎవరికైనా సరే అతడు అనంగుడు".. (శరీర రహితుడు) అని కొంతవరకు ఉపమించే రీతిలో రతీదేవికి అభయప్రదానం గావించాడు. ఇతరులకు ఎవరికీ కనబడనప్పటికీ, అతని విధినిర్వహణయైన మరుబాధాక్రమం మాత్రం నిర్వర్తిస్తూనే ఉంటాడు - మన్మథుడు.

ఆ విధంగా మరుని శరీరం భస్మమైనప్పటికీ - 'ఆత్మజుభావం' నశించనందున, ప్రపంచంలో సమస్త జీవరాశీ అతని వల్ల కామ మోహ పరవశమవుతూనే ఉన్నాయి.

ఏ స్థలంలోనైతే - మన్మథుడు శివుని ఫాలనేత్రం బారినపడి బుడిదగా మారాడో, ఆ స్థలంలో మాత్రం మన్మథుడి మహత్తులూ, మాయలూ ఏవీ పనిచేయకుండు గాక!" అని శివుడు ఆనతిచ్చి, ఉన్నందున అక్కడే తపస్సు చేస్తూన్న నారదుల వారి విషయంలో మన్మథ ప్రతాపం ఎంత బలీయంగా ఉన్నప్పటికీ ఫలితమివ్వడం లేదు. మునీంద్రునికి తపోభంగం కలగడం లేదు. శివుడా రీతిన ఇచ్చిన ఆనతిని అంతా విస్మరించారు. అదీ శివమాయాధీనమే!

ఇటు రతిపతి గానీ , అటు శచీపతి గానీ ఈ శివమాయ కతీతులు కారు కదా! అదంతా నారద మునిశ్రేష్ఠుని అసాధారణ తపోనిష్ఠగా భావించి ఆయనకు నమస్కరించి, తన మిత్రబృంద సమేతంగా వెను దిరిగి పోయాడా మదనుడు.

"పురాణపురుషా! మా కొక్క ధర్మసందేహము! ఈ మన్మథునికి మరేం పనిలేదా? ఎంతసేపూ పూలబాణాలు పట్టుకు తిరుగుతూ, అవి ఎవరికి సంధిద్దామా అనే పనిగట్టుకు సంచరిస్తుండడమే పనా?" సనందనుడనే ఒక మునివరేణ్యుడు అడిగాడు.

దానికి సూతుడిలా చెప్పసాగాడు: -

"చక్కని ప్రశ్న! నిజమే మరి! అతడికి నియుక్తమైన పని అదే కనుక - దానినే ఆచరిస్తున్నాడు అతడు."

మహర్షులకు ఆసక్తి అధికమైంది. మన్మథుని ఆవిర్భావం గురించీ, అతడికా పదవి ఇచ్చిన వైనం గురించీ పలురకాలుగా ప్రశ్నించారు. అందరి సందేహాలూ విన్నపిమ్మట సూతమహర్షి "మన్మథుని కథ " వివరించడానికి ఉద్యుక్తుడయ్యాడు.
Read More

శివ మహా పురాణం, మన్మధుని గాధ



"ఒకానొక సమయమందు విష్ణు అంశ తో ఒక కుమారుని పుట్టించాలని సంకల్పించిన బ్రహ్మకు హృదయ స్థానం నుంచి నవ యవ్వన విలాసిని యైన ఓ కన్య ఆవిర్భవించింది. ఆమె పేరే సంధ్య.

ఆ సమయంలో బ్రహ్మ మానస పుత్రులైన దక్ష - మరీచ్యాదులు అక్కడే ఉన్నారు. ఆ కన్యను చూసి అంతా ఆశ్చర్య పోతుండగా, అంత లోనే ఆమెకు కవల సోదరుడా అన్నట్టు బ్రహ్మ హృదయ కమలం నుంచి ఒక నవ యువకుడూ ఊడి పడ్డాడు అక్కడ.


స్త్రీల కన్నా సమ్మోహన కారుడై, అత్యంత దర్ప విలసితుడై ఉన్న ఆ యువకుడు చెరకువిల్లు నూ, పంచ సంఖ్య కలిగిన బాణాలనూ ధరించి ఉన్నాడు. జన్మిస్తూనే బ్రహ్మకు నమస్కరించి తనకొక పేరూ పదవీ కావాలన్నాడు. ఏదో ఒక వ్యాపకం కల్పించ మంటూన్న ఆ యువకుడిని చూస్తుంటే ఎవరికీ నోరు మెదపాలని కూడా అనిపించక నిర్నిమేషులై అలా చూడ సాగారు. తెలియని ఏదో చిత్రమైన వికారానికిలోను కా సాగారు అందరూ.

ముందుగా ఆ మోహం లోంచి కాస్త తెప్పరిల్లాడు బ్రహ్మ. దర్శించినంత మాత్రాన మోహం పుట్టిస్తున్నావు. ఇక నీకు వేరే వ్యాపకం అనవసరం! ఆ పనే చేస్తుండు. నీకున్న పూలబాణాలతో సర్వప్రాణుల్నీ సమ్మోహన పరుస్తుండు. స్త్రీ, పురుషులు నీ బారినపడి, కామంలో చిత్త చాంచల్యం కలగజెయ్యి. నీ రహస్య సంచారానికి తిరుగు లేదు. భావజుడవు నీవు. తలచినంత మాత్రాన వచ్చి వ్రాలగలవు. నీధాటికి త్రిమూర్తులైనా చలించాల్సిందే! పుడుతూనే మనోచాంచల్య కారకుడవు కనుక మన్మథుడు అనే పేరు నీకు సరిపోతుంది. కామోద్దీపకుడవు కనుక, నిన్ను కామదేవుడనీ అనగలం. గొప్పదర్పం కలిగిన వాడవు కనుక కందర్పుడనీ వ్యవహరిస్తాం. మదనుడు, మారుడు, సుమశరుడు, పుష్ప చాపుడు, పంచశరుడు, స్మరుడు, మనసిజుడు, పుష్పధన్వుడు, ఆత్మభువు... ఇవన్నీ నీ పేర్లే. అని అక్కడ సభలోనున్నవారంతా వివిధరీతుల మదన కుమారుడ్ని శ్లాఘించారు.

తనకంటూ ఒక వ్యాపకం కల్పించగానే, అది అక్కడికక్కడే నిర్వర్తించబోయాడా అత్యుత్సాహి. చకచకా పూలబాణాలను అక్కడున్న వారిమీద ఎడాపెడా ప్రయోగించేశాడు. అన్నిటికంటే పెద్ద చిక్కొచ్చి పడింది బ్రహ్మదేవుడికి. సరిగ్గా అంతకు కొద్దిసేపటి క్రిందటే, మన్మథునితో పాటే జన్మించిన నవయువతి, కుసుమకోమలి, బ్రహ్మ మానసపుత్రి మీదనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. ఆ అవస్థ బ్రహ్మకు కూడా తప్పలేదు.

ఘోరమైన తప్పిదం జరగకుండా ధర్మదేవత సకాలంలో స్పందించి అడ్డుపడబట్టి సరిపోయింది. తక్షణమే అక్కడ మృత్యుంజయుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మనూ, ఆయన మానస పుత్రులనూ మందలించాడు. వావివరసలు మరచి కామించబోయిన వారందరికీ కామోపసంహారం చేసి అదృశ్యుడయ్యాడు మహాదేవుడు.

బ్రహ్మకు ముచ్చెమటలు పోశాయి. చిరాకు అధికమైంది. శివునితో చెప్పించుకోవలసి వచ్చినందునకు లజ్జితుడై, ఆ చిరాకును మన్మథుని మీద ప్రసరింపచేశాడు. 'నాలుగు ముఖాలున్నా ఏం లాభం? పరువుపోయక ఏ ముఖం పెట్టుకుని దేవతలందరికీ పెద్దదిక్కుగా వ్యవహరించగలను? ఇదంతా నీ వల్లనే జరిగింది కనుక - పరమశివుడంతటి వాడిని రప్పించేలా, నాకు నీతులు చెప్పించేలా చేశావు కనుక ఆ ముక్కంటి మూడోకంటి అగ్ని చేత నీవు దహింపబడెదవుగాక!' అని శపించేశాడు విధాత.

ఉద్యోగధర్మ నిర్వహణ చేశానంటాడు మన్మథుడు. అయినప్పటికీ వావివరసలు చూడకూండా కామవికారం పుట్టించావు అంటాడు ప్రజాపతి.

తనతప్పు లేదంటాడు కాముడు. అసలు... కామం యొక్క గుణమే అంత! దాని స్వభావం అది, ఎలా అతిక్రమిస్తుంది? కుమారుడి వాదనలో బలం ఉందని గ్రహించిన చతురాననుడు, చతురంగా తన శాపాన్ని సమర్థించుకున్నాడు . సరే! నీవు త్రినేత్రుడి ధాటికి మాడిమసైనా, నీ ప్రమేయమే లేకుంటే సృష్టి జరగదు కనుక, అ పరమేశ్వరానుగ్రహాన తిరిగి నీవు జీవించగల్గుతావు అని శాపోపహతి చెప్పాడు స్రష్ట. అంతలో - బ్రహ్మ మానసపుత్రుడైన దక్షుని స్వేదం నుంచి ఓ మనోహరాంగి ఉద్భవించింది. శృంగార సీమలకు పట్టపురాణి అనదగ్గ ఆ కన్యకామణికి 'రతి' అని నామకరణం చేసి, మదనుడి వంక చూశారందరూ.

సర్వులనూ మోహింపచేసే మన్మథునికే, మదనవికారం కలిగించేలా ఉన్నది అ రమణీయమూర్తి. కామకారకుడికి కొంతవరకు అతని వృత్తి ఉధృతిని తప్పించగల తరుణీమణి ఆమెయే అని తోచింది అందరికీ. స్త్రీ పురుషలు సంభోగించడానికి ఎన్ని పద్ధతులున్నాయో అన్నిటినీ ప్రయోగిస్తూ వారిరువురూ ఆనంద డోలికల్లో ఊగసాగారు. అంతేకాక ఎన్నో కొత్తరీతులను ఆవిష్కరించే ప్రయత్నాల్లోనూ పడ్డారు. అదీ మన్మథగాథ! ఈ గాథ ఆసాంతం విన్నా, చదివినా, శృంగార సీమల్లో విహరించు వారి సర్వాభీష్టములు నెరవేరునట్లు బ్రహ్మ అనుగ్రహించాడు. అయితే మన్మథదహనం అంత స్వల్పకాలిక వ్యవధిలోనే జరుగలేదు. ఈ నడిమి కాలంలో మరికొంత కథ నడిచింది" అన్నాడు సూతుడు.

అది కూడా సవిస్తరంగా వినిపించమని కోరారు శౌనకాది మహర్షులు.
Read More

శివ మహా పురాణం, సుమశరుని పరాజయం



మన్మథుని జనక కాలమందు జరిగిన ఘటన గుర్తొచ్చినప్పుడల్లా బ్రహ్మదేవుడికి హృదయమందు, శూలి గుచ్చిన మందలింపు మాటలనే శూలపుపోట్లు బాధించసాగాయి. శివుడికేం? నిత్య విరాగి! తపోనిష్ఠలో కూర్చున్నవాడికి తరుణి తపనలో వేదన ఏం తెలుస్తుంది? ఒక్కసారైనా స్త్రీ సంయోగ - వియోగ బాధ కలిగించి ' కామం ' యెక్క ప్రభావం ఎలాంటిదో చవిచూపించ దల్చుకున్నాడు చతురాననుడు. తన ఆజ్ఞగా మన్మథుని ప్రేరేపించి శివుణ్ణి ఓ ఊపు ఊపమన్నాడు. మన్మథుని మాయలకు రుద్రుడు చలించలేదు.


సుమశరునికీ పౌరుషంగానే ఉంది. తన పూలబాణాలతో, యోగి పుంగవుల్నీ భోగ విషయసూయ మానులను చేసిన ఘనుడతడు. రుద్రుని దీక్షను చిద్రం చేయడానికి తనకు ప్రత్యేకాస్త్రాలు దయచేయించమని, కమలాసనుని కోరాడు కందర్పుడు.

కేవలం పూలబాణాలతోనే హడలెత్తిస్తున్న కాముడింకా కొత్తఅస్త్రాలు పొందితే, సృష్టిలో ఇక సమస్తకార్యాలూ స్తంబించి, కామకార్య మొక్కటే విజృంభిస్తుందని దూరాలోచన చేసినవాడై - విధాత యోచించాడు.

ఒక ఆలోచన స్ఫురించి, ఆయన మదినుండి వసంతుడు ఉద్భవించాడు. పుడుతూనే తన సుగంధ శోభతో - మలయ పవనాలతో అక్కడున్న వాతావరణమంతా ఆహ్లాదకరంగా మలచాడు. మన్మథుడికి అతడిని జతచేసి శివునిపైకి ఉసిగొల్పినా ప్రయోజనం లేకపోయేసరికి - ఉస్సురని నిట్టూర్చిన బ్రహ్మ ఎదుట, అ నిట్టూర్పులో నుండే 'మారయ మారయ - భేదయ భేదయ ' అని అరుస్తూ కొన్ని గణాలు ఓ సమూహంగా ఉద్భవించాయి. వాళ్ళందరినీ' మార గణాలు ' అనే పేరిట మన్మథుని అనుచరులను చేసి, బ్రహ్మ మళ్ళీ మహా శివుని మీదకు దండయాత్ర చేయించాడు. ఫలితం శూన్యం.

"మనం త్రోవతప్పి కాముని ప్రసంగంలో పడ్డాం! మన నారద మహర్షుల వారు శివతత్త్వ జిజ్ఞాసాపరులై, ఉగ్రతప మాచరిస్తున్న వైనాన్ని అక్కడే వదిలేశాం!" అను గుర్తుచేసుకున్నారుం శౌనకాదులు.

"ఋషివరేణ్యులారా! ఇదంతా శివ సంకల్పానుసారం జరుగుతున్నదే! ఒక గాథలోంచి మరొకగాథ, అందుండి ఇంకొక ఉపకథ... ఈ పురాణ సముచ్చయమంతా ఒక గాధామాలిక! ఒక్కో అంశానికి ఎన్నో అనుబంధ గాధలతో సంబంధం ఉండి తీరుతుంది. అవన్నీ ఆమూలాగ్రం తెలుసుకోవడం కూడా పురాణ సమగ్రతకు దోహదకారి అవుతుంది!" అని వివరించి నారద తపస్సు గురించి ప్రస్తావించాడు సూతుడు మళ్ళీ.

నారదుని తపోగర్వం:

'ఆవిధంగా శివ శాసనం వల్ల, కామదహన ప్రదేశంలో ఎటువంటి మాయలుగాని, మారవికారాలు గాని ఫలించలేదు. పైగా శివమాయా ధీనులై ఉన్న వారందరికీ, ఆ శాసనం గుర్తులేకుండా పోయి నందున -అదంతా నారద మునీంద్రుల ఉగ్రతపః ప్రభావమేనని భావించారు. మన్మథుని పరాజితుని చేయడంలో, నారదునిదే పైచేయి కావడంతో - శివుడంతటి వాడితో ఆ మునీంద్రుని పోల్చి కొనియాడసాగారు.

కొంతకాలానికి తత్త్వదర్శనం చేసుకున్నాక నారదముని కన్నులు తెరిచి తపస్సు చాలించాడు. ఆ నోటా - ఈ నోటా తాను కాముని జయించినట్లు ప్రచారంలో ఉన్నసంగతి తెలుసుకుని, అదంతా తన ప్రతిభే అని విర్రవీగసాగాడు నారదుడు.

హరి బ్రహ్మాదులకే శక్యం కాని శివమాయా తరణం, నారదుని వశమా? తత్త్వ దర్శనం జరిగిందనుకున్నాడే గానీ, నిజంగా శివతత్త్వం బోధపడి ఉంటే - అహంకరించేవాడే కాదుకదా!

అందరూ - మదనునిపై విజయమే మాయపై విజయంగా అభివర్ణించేసరికి 'అవునుకాబోలు ' అనుకున్న నారదుని గర్వానికి అంతు లేకుండా పోయింది. ఆ గర్వాంధత ఎట్టిదంటే-

సాక్షాత్తు శివుడి ఎదుటికే వెళ్లి, ఆ మహాదేవుడినే తూలనాడేటంత స్థాయిలో ఉంది. కైలాసవాసుడి కడకేగి, తన కందర్ప విజయం ప్రగల్భాలమయం కాగా పరమాత్ముడిని తానేనని ప్రకటించుకునేటంతవరకూ వెళ్లింది - నారదుని స్థితి.

మహాదేవుడు శాంతచిత్తుడై, నారదుడిపై జాలికొద్దీ - ఆసాంతం విని నవ్వుకున్నాడు.

"బాగానే వుంది గానీ మహర్షీ! ఇలాంటి మార్మిక విషయాలు అందరితోనూ చెప్పరాదు. ఏదో నేను భోళాశంకరుణ్ణి కనుక - నేనెవ్వరితోనూ అనను కనుక, నాదగ్గర అంటే అన్నావు కాని ఇంకెక్కడా చెప్పకు! మరీ మరీ దాచవలసిన ఇలాంటి అంశం, ముఖ్యంగా ఆ శ్రీహరి సన్నిధిన మాత్రం అస్సలు చెప్పకు!" అని నారదుడిలోని ఇంకా అంతర్భూతమై ఉన్న కొంటె తనాన్ని రెచ్చగొట్టి మరీ వదిలాడు శివుడు.

అసలే జడధారి. ఆపైన పెడదారి పట్టిన బుద్ది. శివుడు చెప్తున్నంత సేపూ విన్నట్టే విన్నప్పటికీ, కైలాసం సరిహద్దులు దాటేసరికి అవన్నీ గాలి కొదిలేశాడు. బ్రహ్మలోకానికి వెళ్లి తండ్రితో తన గొప్పలు చెప్పుకున్నాడు. 'ఆత్మస్తుతి దూష్యంరా తండ్రీ! అలా ఎవర్నీ వారే పొగుడుకోరాదు ' అని బ్రహ్మ కూడా మందలించాడు.

తన కళ్ళముందే తన కొడుకు తనను మించి ఎదిగిపోవడాన్ని, ఆ వృద్ధ పితృదేవుడు భరించలేక ఇలా అంటున్నాడనిపించింది నారదుడికి. శివుడికీ ఇదే బుద్ధి! ఇక తనను సరిగ్గా అర్థంచేసుకునేది ఆ శ్రీమన్నారాయణు డొక్కడే. ఈ నారదుని ప్రతిభ ముల్లోకాలకే కాదు... ఏడేడు పధ్నాలుగు లోకాలకూ వెల్లడి చేయగల మహావిష్ణువు సర్వవ్యాపి! ఆయన తల్చుకోవాలే గాని, "పరమాత్ముడు నారదుడే" అని ప్రచారం కూడా చేసిపెట్టగలడు. బహుళా తనకంత పేరు ప్రఖ్యాతలు రావడం ఇష్టం లేకనే, శివుడు అలా అడ్డుపుల్ల వేసి వుంటాడు... అనుకున్నాడు నారదుడు.

పాలకడలిపై పవళిస్తూ, లోకపాలనలో వింతలన్నీ అవలోకిస్తూన్న విష్ణుదేవుడి దృష్టికి నారద ప్రగల్భాలేవీ దాటిపోలేదు. ఆయనా నవ్వుకున్నాడు. తీరా ఆ 'నారదపరమాత్మ' తన వద్దకే వచ్చేసరికి తత్తరపడి, స్వాగత సత్కారాలు స్వయంగా చేశాడు హరి. విష్ణుదేవుడంతటి వాడు తన కెదురేగి సత్కరించడంతో - తాను వెంట్రుకవాసి తేడాలో మహావిరాట్ పురుషుడే అని నమ్మకం కలిగిపోయింది నారదుడికి. ఈ ప్రళయం, సృష్టీ, అనంతకాల కల్పాలూ, మన్వంతరాలూ, యుగాలూ, ఈ త్రిమూర్తులూ, వారి అనుచరగణాలూ, చరాచర జగత్ సృష్టీ అంతా తన మహాత్యమే అని తారాస్థాయిలో చెప్పుకుంటున్న నారదుడి ధోరణి విని 'ఆహా!' అన్నాడు శ్రీహరి. అని ఊరుకున్నాడా? "తమంత వారికలేరు. తమంతవారు ఇక తమరే!" అని రెట్టించాడు.

అందులో నర్మగర్భితంతా వున్న వేళాకోళాన్ని గ్రహించే స్థితిలో లేడు నారదుడు.

శివమాయలో చిక్కుకుని, అహంకరిస్తూ తన స్వస్వరూప జ్ఞానాన్ని క్రమంగా కోల్పోతూన్న నారదునికి మళ్లీ వివేచన కలిగించగల మహాను భావుడు మరి ఇక ఎవరు? ఆపనీ ఆ పరమాత్ముడే చేయాలి.

'విష్ణువు తన మాటలు వినడమేకాదు! అంగీకరించాడు కూడా!' అనుకుని పొంగిపోతూ ఇతరలోకాల్లో తనప్రజ్ఞ తానే స్వయంగా చూటుకోవడానికి బయల్దేరాడు నారదుడు.

నారదుడలా వెళ్లగానే, శ్రీ హరి నారదునికి గట్టిగా బుద్ధి చెప్పదల్చుకున్నాడు.
Read More

శివ మహా పురాణం, విష్ణు మాయ



శివుని ప్రేరణ వల్లనే విష్ణువుకు అటువంటి అభిప్రాయం కలిగిందనడం సమంజసం! శివమాయా ప్రెరితుడై శ్రీహరి, ఒక మాయా మహానగరి సృష్టించాడు. దానికొక రాజు - శీలనిధి. అతడికి అపారమైన అనుచరవర్గం... అతనికో కూతురు - పేరు శ్రీమతి. ఇలా అంతా సహజం అనిపించేటంత భ్రాంతిమయ మంత్రనగరి నారద సంచారానికి అతి చేరువలొ ఉండేలా నిర్మితమైంది.


తనకు తెలిసిన లోకాలే కాక, ఈ నగరి ఎక్కడ్నుంచొచ్చింది? అనే ఊహ అయినా చేయకుండా నారదుడా నగరిలో అడుగుపెట్టాడు. అదే మాయా విలసనం అంటే!

నారదుని రాకకు పరమానంద భరితుడైన ఆ మహా ఇంద్రజాల నగరి రాజు శీలనిధి స్వాగత సత్కార్యాలు యధావిధిగా చేసి, అంతఃపుర మందిరంలోకి ఆయనను తోడ్కుని వచ్చాడు. వేయి అప్సర స్త్రీల రూప లావణ్యాల్ని తిరస్కరించేటంత జగజ్జేగీయమాన సౌధర్యంతో రాజిల్లుతున్న తన కుమార్తె శ్రీమతిని చూపించి, ఆమె చేత మునీంద్రులకు నమస్కరింపజేశాడు. ఈమెకు త్వరలో స్వయంవరం ఏర్పాటు కానున్నది. ఉత్తముడైన భర్తను పొందే భాగ్యం కలిగించండి! దీవించండి! అన్నాడు.

సమవిభక్తాంగయై, సమ్మోహకారంగ పరిస్ఫుట సౌందర్య రాశియై, రతీమన్మథుల జంట ఏకరూపమై వెలిగినంత శృంగారోద్దీపకమై, వయ్యారాలుపోతూ తన ఎదుటనిలిచిన ఆ లీలా లలనామణిని చూసేసరికి, నారదునుకి మతి అదుపుతప్పింది. చిత్తచాంపల్యం అధికమైంది. అస్తు! అస్తు! అన్నాడే గాని , ఆమె అందాన్ని విస్తుపోయి చూస్తూ కన్నార్పకుండా కళ్లతోనే ఆ వనితారత్న సౌందర్యాన్ని గ్రోలుతున్నాడు నారదుడు.

శివ తపోభూమిలో, శివుడానవల్ల కాముణ్ణి దూరం తరిమిన నారద తపోనిష్ట, ఆ తపోభూమి వెలుపల నిష్పలమైంది. కామకేళీ మనో లగ్నత ఓడించింది. పెళ్లాడితే ఇటువంటి కన్యనే పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు.

కానీ, ఎలా?!... చూడబోతే తాను జడదారి. ఆమెవంటి అపురూప సౌందర్యరాశి తనబోటి మునిమ్రుచ్చు నెట్లువరిస్తుంది? శౌర్య పరాక్రమ విలసితమై, మదన సమ్మోహరూప సముపేతమై అలరారే ఎందరెందరో క్షత్రియ, దేవ , గంధర్వ కుమారులు... ఇందరిని కాదని - ఆమె తనదాకా వచ్చేదెలా? ఈ ఆలోచన కలగగానే, తనకు ఈ విషయంలో సహాయం చేయగలవా రెవ్వరా అని క్షణం యోచించాడు.
Read More

శివ మహా పురాణం, నారద గర్వ భంగం



తనను సరిగ్గా అర్థం చేసుకోగలవాడు ఆ శ్రీహరి ఒక్కడే అని స్ఫురించడంతో, వైకుంఠం దారిపట్టి - శ్రీ మహా విష్ణువుకు తన మానసాన్ని వివరించాడా బ్రహ్మపట్టి.

'అందమైన రూపంలో నీకు సాటిరాగలవా రెవ్వరూలేరు ' అని జనార్థనుని పొగిడి - 'నీ రూపాన్ని నాకు ప్రసాదించి, పెళ్ళయ్యేవరకు అనుగ్రహించు! అ తర్వాత నా పాట్లేవో నేనుపడతాను ' అని వేడుకున్నాడు. కామమహిమ అంతటిది! కేవలం బాహ్యమైన ఆకర్షణ కలిగించే రూపం కోసం ప్రాధేయపడి యాచించాల్సిన పరిస్థితిని కల్పించింది.


లోలోన గుంభనగా నవ్వుకున్న నారాయణుడు సరేనన్నాడు. ఒక్క ముఖం తప్ప, మిగతా శరీరమంతా పురుషులకే సమ్మోహం కలిగించేటంత అందంగా మార్చి ముఖం మాత్రం వానరరూపంలో కనిపించేలా ఉంచేశాడు. ఎవరి ముఖం సంగతి వారికి తెలియదు కనుక, ఆ వీలును ఇలా ఉపయోగించు కన్నాడు విష్ణువు.

శ్రీహరినే నెరనమ్మిన నారదుడు, మారుని తలపులే మదిలో సందడి చేస్తుంటే మరో ఆలోచన లేకుండా, అత్యుత్సాహంతో స్వయంవరానికి బయల్దేరాడు. నారదుడు స్వయంవర సభామంటపంలో ప్రవేశించగానే, శివమాయా ప్రేరితులై రుద్రగణాధినేత లిరువురు చెరోపక్కా ఆయన్ను అనుసరిస్తూ (బ్రాహ్మణ వేషధారులై వున్నందున) నారదునికి అనుమానం రాకుండా మెలగసాగారు. చివరికి నారదుడు కూర్చున్న చోటికే వచ్చి ఇరువైపులా ఆశీనులయ్యారు.

శ్రీమతి పుష్పమలాధారిణి అయి, స్వయంవర సభావేదికను సమీపించింది. సభలోని అందర్నీ కలయజూసింది. కోతి ముఖంతో వచ్చిన నారదుని చూసే సరికి ఆమెకు అప్రయత్నంగా నవ్వురాగా, కామతప్తుడై వున్న నారదునికి ఆమె నవ్వు సుప్రసన్నంగా - తనపట్ల పరవశంగా వునట్లు తోచింది. తన ముఖారవిందాన్ని మరింత విప్పార్చి, ఆమెనే అలా చూస్తుండిపోయాడు నారదుడు.

ఆమె దగ్గరగా వచ్చి, మరోసారి తన ముఖాన్ని చూసి నవ్వడంతో అదంతా సుముఖంగానే వునట్లు భ్రాంతి చెందిన నారదునికి ఆశాభంగం కలిగిస్తూ తనను దాటి వెళ్లిపోయింది శ్రీమతి.

ఈలోగా మాధవుడు, అపర మన్మథుడిలా అక్కడికి రావడం - శ్రీమతి వరమాల అతడి కంఠసీమ నలంకరించడం వెన్వెంటనే జరిగిపోయాయి. హతాశుడయ్యాడు నారదుడు.

బ్రాహ్మణ వేషధారులై ఉన్న రుద్రగణాధిపు లిద్దరూ నారదుని అవస్థ కనిపెట్టి, "దేనికయ్యా అంత ఆందోళన?! ఆమె ఎవరికి చెందాలో వారికే చెందిందిలే! అయినా.. అందుకోడానికి నీకేం అర్హతవుంది? అందమైన లేదుకదా! అసలు నీముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా?" అంటూ ఎద్దేవా చేశారు.

సందేహిస్తూనే, తన ప్రతిబింబాన్ని అక్కడే వున్న కాచఫలకంలో చూసుకున్నాడు. వానర ముఖాకృతి అచ్చుగుద్దినట్లు కనిపించేసరికి, గ్రద్ద వాహనారూఢుడి మోసం గమనించి నొచ్చుకున్నాడు.

తనకు ఇరువైపులా చేరి వేళాకోళం చేస్తున్న ఇద్దరిని బ్రాహ్మణులుగానే భావించుకున్న నారదుడు, "సాటి బ్రాహ్మణుని సమయా సమయాలు గానక, పరిహసిస్తున్న మీరు బ్రాహ్మణ బీజాన రాక్షసులై జన్మించెదరు గాక!" అని శపించి, క్రోధావేశం చల్లారక వైకుంఠవాసుని కొంటె చేష్టను కడిగి పారేయ్యాలని వైకుంఠం దిక్కుగా పయనమయ్యాడు.
Read More

Sunday, 1 March 2015

మాఘ పురాణం



మాఘ పురాణం

మాఘమాసమందు ఏకాదశీ మహాత్మ్యము – క్షీర సాగర మథనము.
మాఘమాసమునందు నదీస్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేథ యాగము చేసిన ఫలము కలుగును. అట్లే ఈ మాఘమాస ఏకాదశీ వ్రతం చేసి ఉపాసం వున్న వారలు వైకుంఠప్రాప్తినొందగలరు. మాఘమాసమందు ఏకాదశీ వ్రతమొనరించి సత్ఫలితము పొందిన దేవతలకథలు వినండి.
పూర్వకాలమందు దేవతలు, రాక్షసులు క్షీర సాగరమును మధించి అమృతమును గ్రోలవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మంధర పర్వతమును కవ్వముగాను, వాసుకి అను సర్పమును త్రాడుగాను, చేసుకొని క్షీరసాగరాన్ని మధించసాగారు. తలవైపు రాక్షసులు, తోక వైపు దేవతలు ఉండి మధించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుఱ్ఱము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరల పాల సముద్రమును మధించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్ని తుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విష జ్వాలలకు సమస్త లోకములూ నాశనమవసాగాయి. దేవతలు, రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులూ సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటినుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవ దానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మధించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారిరువురు తగవులాడుకొన సాగిరి. అంతట శ్రీమహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగవును పరిష్కరింపదలచాడు.
మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని యైన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయా మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్యరాశి. ఆమె వారిరువురి మధ్యకూ వచ్చి అమృతాన్ని ఇరువురికీ సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగవులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను. మీకిష్టమేనా? అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ, రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని రెండు భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు, అమృతమును దేవతలకు పోయసాగింది. మంద భాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింప సాగారు. ఈవిధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఈమోసమునకు రాక్షసులు, దేవతలు గొడవపడ్డారు. శ్రీమహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా రెండు చుక్కలు విధివశాత్తూ నేలరాలాయి. అవి పడిన చోట రెండు దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరుపోసి పెంచసాగాడు. కొంత కాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలను వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళ్తూ పారిజాత పుష్ప వాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్యయైన శచీదేవికి ఇచ్చాడు. మిగిలిన వారు కోరగా మరల వచ్చి రహస్యంగా పువ్వులను కోయదలచి తోటలో ప్రవేశించాడు. అంతకు ముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై, వనమంతా జల్లాడు. దేవేంద్రుడు పారజాత పువ్వును త్రెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో, విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయాడు. ఈవార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమలాడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించాడు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరాడు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుటచే అమోఘమైన శక్తిచే అలరార సాగాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాద మొనరించి అమృత తుల్యమగు పారిజాత వృక్షాన్ని దానికర్హుడగు దేవేంద్రునికి ఇప్పించెను. అట్లే తులసిని తన సన్నిధిలో ఉండమని చెప్పగా నాటినుండి తులసి శ్రీమహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొన సాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును.
ఫలశ్రుతి:
సూతమహర్షి శౌనకాది మునులతో మహర్షులారా! వశిష్ఠుల వారు దిలీపునకు తెలియజేసిన మాఘమాస మహాత్మ్యమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించితిని. మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చింది. కావున సర్వులూ మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియమ నిష్ఠలతో చేసి ఆ శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయాలి. ఆదిత్యుని పూజించి విష్ణ్వాలయమును దర్శించి శ్రీమన్నారాయణునకు పూజలు చేయాలి. మాఘమాసం ముప్పది రోజులూ క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలతోనూ, ఏకాగ్రతతోనూ, చిత్తశుద్ధితోనూ శ్రీమహావిష్ణువు ను మనసారా పూజించినచో సకలైశ్వర్య ప్రాప్తియూ, పుత్రపౌత్రాభివృద్ధియు, వైకుంఠప్రాప్తి నొందగలరు.
సర్వే జనాః సుఖినో భవన్తు!!
మాఘపురాణం సంపూర్ణం!!
Read More

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం - ఫాల్గుణ మాసం. ఫాల్గుణమాసంలో మొదటి పెన్నెండు రోజులు, అంటే శుక్లపక్షపాడ్యమి మొదలు ద్వాదశి వరకూ శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన రోజులు. ప్రతి రోజూ తెల్లవారు ఘామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, శిరస్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇచ్చిన అనంతరం, శ్రీమహావిష్ణువును షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఈ పన్నెండురోజుల్లో ఒకరోజుగానీ లేదంటే ద్వాదశి నాడుగానీ వస్త్రాలు, వివిధదాన్యాలను పండితులకు దానముగా ఇవ్వడం మంచిది. శక్తివున్నవారు ఏదైనా వైష్ణవాలయానికి ఆవును దానమివ్వడం విశేష ఫలితాలనిస్తుంది. పూర్ణిమనాడు పరమశివుడిని, శ్రీకృష్ణపరమాత్మను, మహాలక్ష్మినీ పూజించడంతో పాటూ "లింగపురాణం" ను దానముగా ఇవ్వడం మంచిది. అట్లే ఈనాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపవలెను. దీనిని డోలోత్సవం అని అంటారు. దీనినే కొన్ని ప్రాంతాలలో డోలాపూర్ణిమ అని అంటారు. నరాడోలాగతం దృష్ట్యా గోవిందం పురుషోత్తమం ఫాల్గున్యాం ప్రయతోభూత్వా గోవిందస్య పురంప్రజేత్‌ ఉయ్యాలలో అర్చింపబడిన పురుషోత్తముడైన గోవిందుని ఈ రోజున దర్శించిన భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఈ రోజున రంగుపొడులను, రంగునీళ్ళను చల్లుకోవాలని చెప్పబడింది. ఈ రోజున ఉదయాన్నే నూనెతో తలంటిస్నానం చేసి 'చూత కుసుమ భక్షణం' తప్పక చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పూజ ప్రకారం, ఇంటిని శుభ్రం చేసి, ఇంటి ప్రాంగణంలో తెల్లనిగుడ్డను ఆసనంగా తూర్పుముఖంగా కూర్చుని, ఒక ముత్తైదువుచే వందన తిలకం, నీరాజనాన్ని పొంది చందనంతో కూడిన మామిడి పువ్వులను తినాలి. చూతమగ్ర్యం వసంతస్య మాకందకుసుమం తద సచందనం పిచామ్యద్య సర్వకామ్యార్థ సిద్దయే అనే శ్లోకంతో మామిడిపూతను స్వీకరించాలి. అనంతరం రంగులను నృత్యగానాదులతో చల్లుకోవాలని చెప్పబడింది. అట్లే, హరిహరసుతుడు అయిన అయ్యప్పస్వామి వారు జన్మించిన దినం కూడా ఈనాడే కనుక వారిని పూజించడం విశేష ఫలితాలనిస్తుంది. ఫాల్గుణమాసంలో పూర్ణిమరోజున హోళీపండుగను నిర్వహిస్తుంటారు. ఈ పూర్ణిమ శక్తితో కూడినది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తరఫల్గుణి కలిసి వస్తే, ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. హోళిరోజూన లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణపూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు. ఈ ఉత్సవం వెనుక ఒక కథ ఉంది. ఒకసారి పార్వతి తన ప్రభావం చేత శివుని కళ్ళు మూతపడేటట్లు చేసింది. శివుని కళ్ళు మూతపడినందు వల్ల జగమంతా అంధకారబంధురమైంది. శివుడు కోపగించు కోవడంతో, అలిగిన పార్వతీదేవి కాంచీపురానికి వచ్చి, తిరిగి శివుని అభిమానాన్ని పొందేందుకు ఒక మామిడి చెట్టు కింద కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించింది. ఒకానొక పాల్గుణపూర్ణిమనాడు మామిడి చెట్టు కింద పార్వతీదేవి ప్రాయశ్చిత్త కర్మకాండను పూర్తిచేసింది. అప్పుడు సంతసించిన శివుడు పార్వతిని అనుగ్రహించాడు. అప్పటినుంచి కాంచీపురంలో ఫాల్గుణ పూర్ణిమ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఫాల్గుణ మాసములో ఈ విధమైన పూజలను, దానాలను చేయడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రవచనం.
Read More

Friday, 27 February 2015

మార్కండేయ పురాణం -2వ భాగం



మార్కండేయ పురాణం -2వ భాగం

ఒకనాడు ప్రభాతవేళ శమీకుడు అనే ఒక మహాముని..
ఆ కురుక్షేత్రం మీదుగా వెళ్తుంటాడు. గంటకింద వున్న గుడ్లు పిల్లలుగా మారి, కిచకిచలాడుతుంటాయి.


అలా ధ్వని విన్న ఆ ముని గంటను పైకి ఎత్తి చూస్తాడు. ఆ గంట కింద అతనికి నాలుగు పక్షి పిల్లలు కనిపిస్తాయి.

శమీకుడు ముని ఆ పక్షి పిల్లల మీద కరుణ కలిగి తన ఆశ్రమానికి తీసుకుని వెళతాడు. అప్పుడు ఆ పక్షులు..

‘‘ఓ మహానుభావా! తండ్రిలా మమ్మల్ని నువ్వు కాపాడావు. నీ ఋణము మేమెలా తీర్చుకోవాలి? మేము ఏ విధంగా నీకు సేవ చేయగలం చెప్పు’’ అని అడిగాయి.

పక్షులు మానవభాషలో మాట్లాడుతున్నందువల్ల శమీకుడు ఆశ్చర్యపడి, ‘‘ఓ పక్షి పిల్లల్లారా! మీరు మానవభాషలో మాట్లాడడం చూస్తుంటే నాకు చాలా వింతగా వుంది. అసలు మీరెవ్వరు?
ఎందుకు ఈ పక్షీ జన్మం ఎత్తారు?

నాకు దయచేసి తెలపండి’’ అని అడగగా... ఆ పక్షిపిల్లలు ఈ విధంగా సమాధానం చెబుతాయి.

‘‘ఓ ఋషీశ్వరా! పూర్వం సుకృతి అనే మహామునికి మేము నలుగురం పుత్రులుగా జన్మించాం.

వేదశాస్త్రాలను చదువుకుంటూ... మా తల్లిదండ్రులను సేవిస్తూ.. కాలాన్ని గడిపేవాళ్లం.

ఇలా వుండగా.. ఒకరోజు దేవేంద్రుడు మా తండ్రిసత్యాన్ని పరీక్షించడానికి గ్రద్దరూపంలో వచ్చి నరమాంసాన్ని ఆహారంగా పెట్టమని కోరాడు.
అప్పుడు మా తండ్రి..

‘‘మీలో ఎవరైనా ఇంద్రునికి ఆహారం అవ్వండి’’ అని ఆజ్ఞాపించారు.
అయితే మేము మా ప్రాణాలను దక్కించుకోవడానికి భయంతో తండ్రి ఆజ్ఞాన్ని పాలించకుండా అలాగే వుండిపోయాం.

అప్పుడు మా తండ్రి మమ్మల్ని పక్షలుగా పుట్టాలని శపించి, తన శరీరాన్ని ఇంద్రునికి ఆహారంగా సమర్పించుకున్నారు.

ఇంద్రుడు మా తండ్రి త్యాగబుద్ధిని సంతోషించి, మమ్మల్ని చూసి...

‘‘మీరు వింధ్యపర్వత గుహలలో నివసించండి. జైమిని అనే వ్యాసశిష్యుడు మీ దగ్గరకు వచ్చి, కొన్ని సందేహాలు అడుగుతాడు.

ఆ సందేహాలను తీర్చి మీరు శాపవిముక్తి పొందండి. మీరు పక్షులైనా..
సర్వవేదాలను పొంది ధర్మపక్షులు, జ్ఞానపక్షులుగా పేరు పొందుతారు’’
అని మమ్మల్ని అనుగ్రహంచి వెళ్లిపోయాడు’’ అని ఆ పక్షులు తమ వృత్తాంతం గురించి శమీకునికి చెబుతాయి.

అప్పుడు శమీకుడు... ‘‘మీరు నాకోసం ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ విధిని నిర్వర్తించడానికి వింధ్యపర్వతాలకు వెళ్లండి’’ అని సెలవిచ్చి వారిని అక్కడి నుంచి పంపివేశాడు’’
కాబట్టి..

ఓ జైమినీ! నువ్వు ఆ పక్షుల దగ్గరకు వెళ్లి నీ ధర్మసందేహాలను తీర్చుకో’’ అని జైమినికి చెప్పి.. మార్కండేయుడు తపస్సు చేసుకోవడానికి వెళతాడు.

జైమిని వింధ్యపర్వతంలో జ్ఞానపక్షులను వెదకడానికి వెళతాడు. అలా కొద్దిసేపు తరువాత అతనికి ఆ పక్షులు కనిపిస్తాయి.

ఆ పక్షులు ఆ సమయంలో వేదాధ్యాయనం చేస్తున్నాయి. అతడు ఆ పక్షుల దగ్గరకు వెళ్లి..
‘‘ఓ పక్షులారా! నేను వ్యాసుని శిష్యుడిని.
నన్ను జైమిని అంటారు.

మార్కండేయుడు చెప్పిన విధంగా నేను మీ దగ్గర కొన్ని ధర్మసందేహాల గురించి అడిగి తెలుసుకోవడానికి ఇక్కడికి చేరుకున్నాను
నా సందేహాలను తీర్చండి’’ అని చెప్పగా...

ఆ పక్షులు ‘‘నీకున్న సందేహాలేంటో అడుగు.. మా చేతనైంతవరకు సమాధానాలు చెబుతాం’’ అని సమాధానం ఇస్తాయి.

Continues...
Read More

మత్స్య మహా పురాణం -3వ భాగం నారాయణుడి మత్స్యవతారం :



మత్స్య మహా పురాణం -3వ భాగం

నారాయణుడి మత్స్యవతారం :

శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షమవ్వగానే అతనిని చూసి..


‘‘ఓ మహానుభావా! నీకు తెలియంది ఏదీ లేదు. నీ వల్లే ఈ లోకాలన్నీ పుట్టి, పెరిగి చివరకు నశిస్తున్నాయి.

నీ మహిమను గ్రహించడానికి మేమెంతటివాళ్లం? సృష్టిని నిర్మించినవాడివైన నీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అయినా నీకు విన్నవించుకుంటున్నాను...

నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా వద్ద వున్న వేదాలను అపహరించి మహాసముద్ర గర్భంలో దాచాడు. ఆ వేదాలు నా దగ్గర లేకపవడం వల్ల సృష్టిన తయారుచేసే సామర్థ్యం నాలో తగ్గిపోయింది. నన్ను కరుణించి ఆ వేదాలను సంపాదించి, నాకు నుగ్రహించండి’’ అని ప్రార్థించుకుంటాడు.

అప్పుడు శ్రీహరి పదియోజనాల పొడవుగల చేప రూపాన్ని దాల్చి, బ్రహ్మతో..

‘‘ఓ బ్రహ్మదేవా! విచారించకు. నేను ఈ మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో ఎక్కడ వున్నా ఆ సోమకుడిని వెతికి పట్టుకుని చంపి, వేదాలను నీకు అప్పగిస్తాను’’ అని మాటిచ్చి.. సముద్రంలోకి వెళ్లిపోతాడు.

సోమకాసురుడు అపహరించుకుని తీసుకుపోయిన వేదాలను.. తినే పదార్థాలు అనుకొని వాటిని మింగేస్తాడు.

కాని అవి అతని ఆకలి తీర్చలేదు. దీంతో అతను ఆకలి తీర్చుకోవడం కోసం ఆహారాన్ని వెదకడం మొదలుపెట్టాడు. అదే సమయంలో మత్స్యరూపమెత్తిన శ్రీమన్నారాయణుడు కూడా అతనిని వెతుక్కుంటూ, అతను వున్న ప్రాంతానికి చేరుకుంటాడు. సోమకాసురుడు..

‘‘ఈ చేప ఎంత బాగుంది. దీనిని నా ఆహారంగా మలచుకుంటాను’’ అని తలచుకుని, దానిని మింగడానికి ప్రయత్నిస్తాడు.
కానీ ఆ చేప అతనిని ఎదుర్కుంటుంది. సోమకాసురుడు మహా బలవంతుడే కాబట్టి వారిద్దరి మధ్య యుద్ధం ఏర్పడుతుంది. ఇలా వారిమధ్య యుద్ధం కొన్ని కాలాలపాటు మహాసంగ్రామంలా జరుగుతుంది.

దానవుడు, మత్స్యాన్ని నొప్పించడానికి అనేక రకాల పథకాలు రచిస్తాడు. తన దగ్గరున్న గదాఘాతంతో కొట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే విష్ణువు ఆ దెబ్బ నుంచి తప్పించుకుని తోకతో నీటిని బాదుతాడు. ఆ దెబ్బతో నీరు ఒక యోజనం పైకి ఎగరగా..

సోమకాసురుడు కూడా అలాగే పైకి ఎగురుతాడు. దాంతో సోమకుడు కోపాద్రిక్తుడై మత్స్యాన్ని తన రెండు చేతులతో బట్టి పీడించడం మొదలుపెట్టాడు. అయితే మత్స్యం రాక్షసుని పట్టునుంచి
విడిపించుకుని, తన కోరలతో చీల్చి చెండాడుతుంది. అనంతరం అతని కడుపులో వున్న వేదాలను, ఒక దక్షిణావర్త శంఖమును తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు.

శ్రీ విష్ణువు, బ్రహ్మకు వేదాలు ఇస్తూ.. ‘‘నాయనా! సోమకుడు ఈ వేదాలను మింగడం వల్ల కొన్ని శిథిలమయిపోయాయి.

నీకు జ్ఞాపకమున్నంతవరకు వీటిని శిథిల పురాణం చేసి, స్ఫురించిన చోట ప్రణవంతో పూరించి, సమగ్రంగా పూర్తి చేయు’’ అని చెప్పి అదృశ్యమవుతాడు.

Continues...
Read More

Tuesday, 17 February 2015

మాఘపురాణం - 26వ అధ్యాయము



మాఘపురాణం - 26వ అధ్యాయము

సుధర్ముడు తండ్రిని చేరుట

పాపమా బాలుని జాతకము ఎటువంటిదో గాని తన తల్లి అడవిలో పులిచే చంపబడింది. ఇప్పుడు పెంపుడు తల్లి అడవిలో విడిచిపెట్టి వెళ్ళిపోయినది. ఇక ఆ పిల్లవానిని దీన రక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చీ ఏడ్చీ అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసిమొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసిచెట్టు పై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూ కలుగలేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు. ఆ రోదనకు పక్షులు, జంతువులు, మృగములు కూడా రోదనచేసి ఆ బాలునికి రక్షణగా ఉండి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవి జంతువులచే పెంచబడుతూ దినదినాభి వృద్ధి చెందుతూ ఏ తులసి చెట్టు వద్ద పడి వుండెనో ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.
అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయం గల వాడయ్యెను. ప్రతి దినము తులసి పూజ భగవన్నామ స్మరణ చేస్తూ “నన్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా” అని ప్రార్థించుచు, ఒక్కొక్కప్పుడు విరక్తుడై “ఛీ ఎంత ప్రార్థించినా నా గతి ఇంతేనా? నేను బ్రతికెందుకు?” అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి “ ఓ బాలచంద్రా! నీవట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసం ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానం చేసినయెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును” అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆరాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘమాస స్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.
ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీ నారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీకేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనా పాలనా చేయువారెవరైననూ లేరు. పుట్టినది మొదలు కష్టములే తప్ప సుఖమన్నది ఎరుగను. ఈ వనచరములే నన్ను రక్షించి పోషించుచున్నది. గాన మీ సన్నిధానమునకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కరలేదు” అని ప్రార్థించెను.
“ఓయీ రాజనందనా! నీవు ఇంకను భూలోకమునందు ధర్మంగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి నీ కన్నతల్లిని గురించి బెంగతో ఉన్నాడు. గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆ కొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరునితోడు యిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.
అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భావిటిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో అని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారి జాడ తెలియనందున విచారమనస్కుడై రాచకార్యములు చూడకుండెను. అటువంటి సమయములో మునివెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతం తెలియజేయుసరికి సులక్షణ మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలు చేసి కుమారునికి సుధర్ముడని పేరు పెట్టి పట్టాభిషేకము చేసెను.
Read More

మాఘపురాణం - 27వ అధ్యాయము



మాఘపురాణం - 27వ అధ్యాయము

ఋక్షక యను బ్రాహ్మణ కన్య వృత్తాంతము
పూర్వము భృగుమహాముని వంశమందు ఋక్షకయను కన్య జన్మించి దిన దినాభివృద్ధి పొందుచుండెను. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను.
ఋక్షక తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావముతో ఇల్లు విడిచి గంగానదీ తీరమునకు బోయి ఆశ్రమము నిర్మించుకొని శ్రీమన్నారాయణుని గూర్చి తపస్సు ప్రారంభించెను.
ఆవిధంగా చాలా సంవత్సరములు ఆచరించుట వలన ననేక మాఘ మాస స్నాన ఫలములు దక్కెను. ఆమె మనోవాంఛ ఈడేరు సమయం దగ్గర పడింది. ఒకనాడామె తపస్సు చేసుకొనుచూ ప్రాణములు విడిచెను. ఆరోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడలెను. ఆమె చాలా సంవత్సరములు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకమునకు పోయెను. ఆమె మాఘ మాస వ్రత ఫలము కలిగి పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడామెను సత్య లోకములో దేవకార్యములు తీర్చుటకు అప్సర స్త్రీగా చేసి “తిలోత్తమా”యను పేరుతో సత్యలోకమునకు పంపెను. ఆ కాలంలో సుందోపసుందులనే ఇద్దరు రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సుయొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై “మీకేమి కావలయును? కోరుకొనుడు” అని అనగా “స్వామీ! మాకు ఇతరుల వలన మరణము కలుగకుండా ఉండునట్లు వరమిమ్ము” అని వేడుకొనగా బ్రహ్మ అటులనే ఇచ్చితినని చెప్పి అంతర్ధానమయ్యెను.
బ్రహ్మ దేవుని వలన వరము పొందిన ఆ ఇద్దరు రాక్షసులు మహా గర్వము గలవారై దేవతలను హింసించి మహర్షుల తపస్సులకు భంగము కలిగించు చుండిరి. యజ్ఞయాగాది క్రతువులలో మాంసం, రక్తం, పడవేసి ప్రజలను నానాభీభత్సములు చేయుచుండిరి. దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ తరిమివేసిరి.
ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకమునకు వెళ్ళి బ్రహ్మను వేడుకొని “మహానుభావా! సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరములతో గర్వము గలవారై తపశ్శాలురను బాధించుచూ దేవలోకమునకు వచ్చి మమ్మందరనూ తరిమి చెరసాలలో పెట్టి నానా భీభత్సం చేయుచున్నారు. గాన వారి మరణమునకు ఏదైనా ఉపాయము ఆలోచించు”మణి దేవేంద్రుడు ప్రార్థించెను. బ్రహ్మ దీర్ఘముగా నాలోచించి తిలోత్తమను పిలిచి “అమ్మాయీ! సుందోపసుందులను రాక్షసులను ఎవరి వలననూ మరణం కలుగదని వరం ఇచ్చియున్నాను. వర గర్వంతో చాలా అల్లకల్లోలం చేయుచున్నారు గాన నీవు పోయి నీ చాకచక్యంతో వారికి మరణం కలుగునటుల ప్రయత్నించుము” అని చెప్పెను.
తిలోత్తమ బ్రహ్మదేవునకు నమస్కరించి సుందోపసుందులు ఉన్న అరణ్యమును ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచూ ఆ రాక్షస సోదరులున్న నివాసమునకు సమీపములో తిరుగుచుండెను. వీణానాదమును ఆమె మధుర గానమును విని సుందోపసుందులు తిలోత్తమును సమీపించిరి. ఆమె ఎటు పోయిననటు, ఎటు తిరిగిననటులామెను అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుచుంటిరి. ఆమెను “నన్ను వరింపుము” యని తిలోత్తమను ఎవరికి వారు బ్రతిమలాడ సాగిరి.
ఓ రాక్షసాగ్రేసరులారా! మిమ్ములను పెండ్లియాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి యెడల ప్రేమతో నున్నాను. ఇద్దరినీ వివాహమాడుట సాధ్యం కానిది. గాన నాకోరిక ఒకటున్నది. అది ఏమనగా “మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారినే నేను ప్రేమించగలను” అని తిలోత్తమ చెప్పెను. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింప జేశాయి. నీకంటే నేను బలవంతుణ్ణి అని సుందుడు అంటే, లేదు నేనే బలవంతుణ్ణి అని ఉపసుందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్పో తేల్చుకుందాం అంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్లయుద్ధము చేశారు. పలురకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరిగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొకరి కంఠానికి ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలువిధాలుగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి “తిలోత్తమా! నీ చాకచక్యంతో సుందోపసుందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలవైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు. ఇకనుండి నీవు దేవలోకములో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైనది. వెళ్ళు. దేవలోకంలో సుఖించుము” అంటూ ఆమెను దేవలోకానికి పంపాడు.


Read More

Friday, 13 February 2015

అష్టాదశ పురాణాలలో గణ్యమైన 'స్కాందపురాణం' శివుని నుంచి స్కందుడు విన్నది కనుక ఆయన (స్కంద) పేరునే ఈ పురాణం పేరు పొందింది.



అష్టాదశ పురాణాలలో గణ్యమైన 'స్కాందపురాణం' శివుని నుంచి స్కందుడు విన్నది కనుక ఆయన (స్కంద) పేరునే ఈ పురాణం పేరు పొందింది. తంత్రశాస్త్రంలో కూడా వివిధ సుబ్రహ్మణ్య స్వరూపాలు చెప్పబడ్డాయి.

బాల సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖ సుబ్రహ్మణ్యుడు,వల్లీదేవసేనాసమేతుడు....ఇలా అనేక రూపాలు!ఉత్థిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుని 'సర్ప'రూపాన ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యుని శక్తులు -కుండలినీ శక్తి చలనానికి, ఆగమనంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక 'వల్లీ' (తీగ). ఇంద్రియశక్తులే 'దేవసేన'. ఈమె ఇంద్రకుమార్తె. ఈరెండూ చైతన్యానికి పత్నీస్థానాలు.


ఈవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పరబ్రహ్మగా ఉపాసించారు.

"నీవంటి దైవమును షడానన!

నేనెందు కాననురా!

మారకోటులందు గల శృంగారము

ఇందుముఖా! నీ కొనగోటను బోలునే!!

అని స్కందుని కీర్తించారు నాదబ్రహ్మ త్యాగరాజస్వామి.
Read More

Wednesday, 11 February 2015

మాఘ పురాణం - 1

మాఘ పురాణం - 1
1వ అధ్యాయము - మాఘమాస మహిమ
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||
ప్రపంచదేశములన్నిటిలోను భారతదేశము కర్మధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగివుంది. అట్టి భారతదేశంలో హిమాలయాది
పర్వతములు, గంగాదినదులూ నైమిశం మొదలైన అరణ్యములూ మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైనవానికి అనేకరెట్లు ఫలితాన్నిచ్చేవిగా
ప్రసిద్ధి చెందినాయి. వైశాఖం, ఆషాడం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం, జపం,
తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం బగణ్యమైనది అంటే యింత అని లెక్కకురానిది.
పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి 'స్వామీ! స్నానానికీ, ధ్యానాధికమైన తపస్సుకీ ప్రశాంతమూ, పావనమూ,
సిద్దిప్రదమూ అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షు లారా!
నేను నా చక్రాన్ని విసురుతాను అది యెక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపో యోగ్యమైన ప్రదేశంగా గుర్తించండీ,
అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట, ఆ మహావిష్ణువు యోక్క చక్రనేమి పడిన ప్రదేశాన్ని నైమిశారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది
మహర్షులు అక్కడ స్థిర నివాసమేర్పరచుకొన్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూవుంటే భూమండలంలో వివిధ ప్రాంతంలోని ఆయా
ఆశ్రమాలలోని మహర్షులూ చూడడానికి వస్తూవుండేవారు. అలగే రోమహర్షుణుడో, ఆయన కుమారుడు సూతమహర్షియో అందరిలా ఆయాగాన్ని
చూడడానికి విచ్చేసారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలని, విశేషాలని చెప్పించుకునేవా
రు అంటే నైమిశారణ్యంలోని ఆ ఆశ్రమంలో జపహోమాదులూ లేనప్పుడు పుణ్యకథాప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మనస్థైర్యాన్ని భగవద్భక్తిని
పేంపొందించేవి.
ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది.
అటువంటి యాగాన్ని చూడాలని చాలా మంది మునులు దేశం నలుమూలలనుండి ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూతమహర్షి
వున్నారు. శౌనకాది మునులు ఆయనకెదురు వెళ్ళి సగౌరవంగా తీసికొని వచ్చారు. తగిన ఆసనం పై కూర్చుండబెట్టి అతిధి
సత్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు. సూతమహర్షి! మీ తండ్రిగారు రోమహర్షణులవారు పురాణప్రవచనంలో
ధర్మవిషయాలను వివరించడంలో సాటిలేని వారు. శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల
సమర్థులు, రోమములకును హర్షము కలిగించువారు కనుగ రోమహర్షణులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడ
ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ
సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలని వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా దయవుంచి మాకు పుణ్య కథలని వినిపించండి అని
ప్రార్థించారు.
సూతమహర్షి వారి ఆతిధ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా
మీద వున్న అభిమానానికి కృతజ్ఞణ్ణి, పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడ
యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్నూ ఈ పుణ్యకార్యంలో యిలా అన్వయించేటట్లు చేసే మీకు నేను కృతజ్ఞణ్ణి. మా తండ్రి
గారి వలన విన్నదాన్ని అనుసరించి, వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత, నాకు తెలిసిన విషయాన్ని, మీ అనుగ్రహం చేత
స్పురింపజేసుకొని యధాశక్తి వినిపించి మీ ఆనందాశీస్సులనీ, భగవత్కృపను పొంద ప్రయత్నిస్తున్నాను, మీ ఆజ్ఞయేమిటి అని సవినయంగా
అడిగెను. అప్పుడు మునులు 'సూతమహర్షి లోగడ వైశాఖమాసం, కార్తీకమాసం వైశిష్ట్వాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన, వ్రతానుష్టాలని
వివరించి మాకానందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని' కోరారు.
అప్పుడు సూతమహర్షి క్షణకాలం కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉండి తండ్రిగారిని గురువులను తలచుకొని నమస్కరించి కనులు తెరచి
మునులకు మరల నమస్కరించి యిలా ప్రారంభించాడు. మహర్షిసత్తములారా! మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య
ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకొన్నవారు కొద్దిమంది అయినా, యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని
పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే సావకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది.పూ
ర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి యిదే విషయాన్ని అడిగింది. గృత్నమదమహర్షి మొదలైనవారు చెప్పిన విషయాలని
పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో బాటు చెప్పెదను వినండి.
పార్వతీదేవి పరమేశ్వరునితో "విశ్వాత్మకా! సర్వలోకేశ్వరా! సర్వభూతదయానిధీ! ప్రాణేశ్వరా! మీ మాటలు అమృతముకంటే మధురాతి మధురములై
నా చెవులకు మరింత యింపుగానున్నవి. మాఘ మాస మహిమను వివరింప గోరుచున్నానని" ప్రశ్నించెను.
అప్పుడు పరమేశ్వరుడు "కళ్యాణీ! జగన్మంగళా! నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది. గంభీరమైనది నాకిష్టురాలవైన
నీకు చెప్పరానిదేమియందును? తప్పక చెప్పెదను, వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతఃకాలస్నానమ
ు చేసినవారు పాపవిముక్తులై ముక్తినందుదురు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం.
మొదటి స్నానం వాని సర్వపాపములను పోగట్టును. రెండవస్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవస్నానం అతనికి
శ్రీమహావిష్ణువే ఋణగ్రస్తుడయేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి యివ్వాలని శ్రీమహవిష్ణువే ఆలోచనలోపడును. ప్రయాగలో
మాఘమాసంలో గంగాస్నానం చేసిన వానికి పునర్జన్మ వుండదు. మాఘ మాసంలో ఉదయాన్నే నది ప్రవాహంలోగాని సరస్సులో గాని స్నానం చేసినవారికి
ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలనున్న సరస్సు, నూయి, కాలువ మొదలైనవానిలో చేసిన స్నానం పాపనాశకం మోక్షదాయకం సుమా,
తెలిసికాని, తెలియకకాని, బలవంతంగాకాని మాఘ మాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని
పాపములన్నియును పోవును. భక్తి భావముతో నెలాంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషియై
జన్మించును.
మాఘస్నానమును మాని, విష్ణువునర్చింపక, దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన
పాపములెట్లుపోవును? అతడు భయంకరమైన కుంభీపాకనరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు,
నీచజన్మలను పలుమార్లుపొందును. చలికి భయపడి స్నానము చేయనివారిని చూడరాదు. అట్టివారిని జూచిన పాపము పోవలెనన్నచో సూర్యుని
చూచి నమస్కరించవలెను. ప్రాతః కాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచజన్మలనందుదురు సుమా, దరిద్రులైనను,
బాలురైనను ప్రాతఃకాల స్నానముచేసిన శ్రీ మహావిష్ణువు దయనుపొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ
చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలుకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి
పుణ్యాత్ముడగును.
ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడైనను, మాఘమాస ప్రాతఃకాలమున మాయందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని
జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసినవానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకుగాని, భయముచే గాని, బలవంతముగాగాని,
మాఘస్నానము చేసినవాడు పాపవిముక్తుడై పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసినవానికి దక్షిణనిచ్చి
వానినుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానముగాని కంబళదానముగాని చేసిన స్నానఫలమునంది
పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని, చేయించిన వారికిని పుణ్యముకల్గును. ఈ స్నానమును అన్ని
వర్ణములవారును చేయవలెను. మాఘస్నానము చేయువారిని నిందించినను, పరిహసించినను, నివారించినను మహాపాపములు కలుగును.
పార్వతీ! మాఘస్నానము సద్యోముక్తిప్రదము దానికి సాటిలేదు. శక్తిలేనివారు కాలు చేతులను కడుగుకొని, ఆచమనముచేసి
పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్నిమాసములలో మాఘమాసముత్తమము. శ్రీవారిదేవతలందరిలో ఉత్తముడు.
అన్నిమాసములలో మాఘమాసముత్తమము. వృక్షములలో అశ్వత్తవృక్షముత్తమము. తేజోస్వంతులందరిలో సూర్యుడుత్తముడు. శాస్త్రములన్నిటిలో
వేదములుత్తమములు. కావున మాఘమాస స్నానము చేయువారిని, నిందించినను, నివారించినను మహాపాపములు కలుగును. నాలుగువర్ణముల
వారిలో బ్రాహ్మణుత్తముడు. పర్వతములలో మేరుపర్వతముత్తమము. కావున మాఘమాస స్నానమనంత పుణ్యప్రదము సుమా.
దిలీపుడను మహారాజు పెక్కుయాగములను చేసిన పుణ్యాత్ముడు. ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఈతడోకనాడు వేటకుపోయెను. అనేక
మృగములను వేటాడి అలసిపోయెను.మనోహరమైన సరస్సునొకదానిని చూచి అచట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యెను.
అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడొకడా మహారజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులనందెను. ఆ బ్రాహ్మణుడు 'మహారాజా!
పరమపవిత్రమైన మాఘమాసమున నీ సరస్సున స్నానము చేయకుండపోవుచున్నానేమి. మాఘమాసమున చేయు నదీస్నానముకాని, సరస్స్నానము కాని
మిక్కిలి పుణ్యమునిచ్చునని యెరుగువా? యని ప్రశ్నించెను. రాజు మాఘస్నానమహిమను చెప్పుడని కోరగానతడు. రాజా నీ విప్పుడీ
సరస్సున తప్పక స్నానము చేసిపొమ్ము మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠమహర్షివలన తెలిసికొనుమని చెప్పి తన దారిన పోయెను.
దిలీపమహారాజు మాఘమాసస్నాన మహిమ తెలిసికొనవలయునని తమ కులగురువైన వశిష్టమహర్షి యాశ్రమమునకు వెళ్లెను. గురువును దర్శించి
నమస్కరించి మాఘమాసస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్టమహర్షి దిలీపుని యాశీర్వదించి యిట్లనెను. నాయనా దిలీపా! నీకోరిక విశిష్టమైనది.
మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు యితర దినములలో చేసిన
పుణ్యకార్యములకంటే ఎక్కువ పుణ్యము నిచ్చును.మాఘమాసమున ప్రాతఃకాలమునచేసిన స్నానమే సర్వపాపములను పోగట్టి అక్షయములైన
పుణ్యఫలములనిచ్చును. స్నానమేయింత అధికమైనపుణ్యము నిచ్చునో పూజ పురాణ శ్రవణాదులవలన నెంతటి ఫలముండునో
యూహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగట్టుకొని శుభలాభములను పొందిన కొందరి
వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలిసికొన యత్నింపుము.
పూర్వమొకప్పుడు భయంకరమైన క్షామము(వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణముగల కరువు) వింధ్య-హిమాలయపర
్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను. దీనివలన సామాన్యజనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు,
సర్వప్రాణుల మిక్కిలి బాధపడినవి, అట్టివారిలో భృగుమహర్షి యొకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు యిష్టములేకున్నను కైలాస
పర్వత ప్రాంతముకడకు చేరి తనకునచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించు కొనుచుండెను.
పవిత్రము మనోహరము అయిన ఆ దివ్యప్రదేశమునకు గంధర్వులు యక్షులు, కిన్నరులు మున్నగు దేవజాతులవారును వచ్చుచుండిరి
అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి.
ఒకనాడు గంధర్వుడోకడు భార్యాసమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగుమహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి
సుందరమైన గంభీరమై మనోహరమైవిచిత్రమై యుండెను. వాని మొగము మాత్రము పులిమొగమై యుండును. ఇందువలన అతడుయెంత
చక్కగానున్నను పులిమొగమువలన విచిత్రముగా భయంకరమై యుండును. అతడు భృగుమహర్షికి నమస్కరించిన తరువాత మునీశ్వరా!
నాకు భోగభాగ్యములన్నియునున్నవి. ఈ నా భార్యను చూసితిరికదా! ఈమె సౌందర్యము గుణసంపద నిరుపమానములు,
నేను గంధర్వుడను మానవులకంటే దివ్యశక్తులు కొన్నియున్నవి. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు బాధాకరముగనున్నది.
దీనిని పోగట్టు కొనుటయెట్లో తెలియరాకున్నది. ఈ వికారమువలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచుటలేదు. దయయుంచి
నాకీ వికారరూపము పోవునుపాయమును చెప్పుడని ప్రార్థించెను.
భృగుమహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలికలిగినది వానికి సాయపడవలయుననుకొన్నాడు. నాయనా పురాకృతకర్మము యెవనిని విడువడు.
గతజన్మలో చేసిన పాపము వలన నీకీస్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికమూ ఇవి మూడును జీవినిబాధించును. ఇట్టి వానిని
పోగట్టుకొని శుభలాభము పొందవలెనన్న పుణ్యనదుల యందు స్నానము, పవిత్రక్షేత్రములందు దేవపూజ చేసినకొనవలయును.ఇట్టి వానిని
పవిత్రమైన కాలమున చేసినచో సద్యఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము,
పూజ, జపము, తపము జీవికి గల పాపమునుపోగట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాదికముచేసినచో
వచ్చుఫలితము, మాఘమాసములో నదిలోగాని, సముద్రములోగాని, కాలువలోగాని, సెలయేరులోగాని యే స్వల్పజల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో
వచ్చును. అనగా మాఘస్నానమును యేప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యము నిచ్చునంత గొప్పది. నీ
జాతివారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున యిది మాఘమాస ప్రారంభముకావున నీ భార్యతో
బాటు ప్రతిదినము ప్రాతఃకాలమున మాఘస్నానమును యిష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగుమహర్షి ఆ
గంధర్వునకు చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును, తీరమున యిష్టదేవతాపూజను విడువక
మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి
మాఘమాసమహిమను కీర్తించును. కృతజ్ఞడై, మునికి భార్యతోబాటు నమస్కరించెను. అతని యాశీర్వాదమునంది తన భార్యలో బాటు తనలోకమున
కరిగెను. దిలీపమహారాజా మాఘస్నాన మహిమను గమనించితివా? మరియోక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలనిట్లు పలికెను
Read More

మాఘ పురాణం - 3

మాఘ పురాణం - 3
3వ అధ్యాయము - గురుపుత్రికాకథ
మంగళదాయినీ! సర్వమంగళా! మాఘ మాసస్నాన ప్రభావముచే పూర్వమొక బ్రాహ్మణపుత్రిక పాపవిముక్తయై తన భర్తతో హరిసాన్నిధ్యము నందినది.
అని శివుడు పార్వతీ దేవితో పలికెను. అప్పుడు పార్వతీదేవి స్వామీ! ఆ బ్రాహ్మణ పుత్రిక యెవరు. ఆమె చేసిన పాపమేమి!
మాఘస్నానమున పాపవిముక్తి నందిన విధానమేమి? వివరముగ చెప్పగోరుచున్నాననగా శివుడిట్లుపలికెను. దేవి వినుము,
పూర్వము సౌరాష్ట్రదేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతడు సదాచారవంతుడు, వేదశాస్త్రపండితుడు.
అతనికి శిష్యులు చాలా మంది వుండేవారు. వారు, గురు సేవచేస్తూ విద్యాభ్యాసం చేస్తూవుండే వాళ్లు. ఆ సుదేవునికి
సర్వాంగసుందరి అయిన కుమార్తె వుండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరులో ఆమె మిక్కిలి మనోహరంగా
వుండేది. ఇట్టి కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేయగలనని అతడు విచారిస్తూవుండేవాడు.
ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, ధర్భలు మొదలైన వాటికోసం గురువు పంపగా వెళ్ళాడు. బంతితో ఆడుకుంటున్న
గురుపుత్రికకూడా సుమిత్రుని వెంబడించి వెళ్లింది. సుమిత్రుడును చాలాదూరముపోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూచాడు. ఆ
చెరువుగట్టున యెత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా వుంది, పద్మాలు వానిపై వ్రాలే తుమ్మెదలరొద, అనేకవర్ణములలోనున్న
కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము, మొదలైనవానిచే ఆ సరస్సు మనోహరముగనుండెను. కోకిలలుగుంపులు కట్టి
మధురధ్వనులు చేయుచుండెను. చిలుకలు గోరువంకలు నేర్చినమాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో కప్పబడిన ఆ
ప్రదేశము ఒక ఏకాంతమందిరములా వుంది.
గురుపుత్రిక ఆ చెరువులోని నీరుత్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసుపడింది.
ఓయీ! మనుష్య సంచారము లేని, యేకాంత ప్రాయమైన యీప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని వున్నది. ఈ
వనము నీకును నాకును నచ్చినది మన మిద్ధరమును పడుచువారము, మన కలయిక సుఖప్రదమగును ఆలసించకనావద్దకు రమ్ము, నా
శరీరము దూదికంటే మెత్తగానున్నది, నీకు మరింత సుఖమిచ్చును, రమ్ము నన్ను మోహములో తనివి దీర కౌగిలించుకొనుము,
రమ్ము రమ్మనిపిలిచెను. సుమిత్రుడు మంచిదానా! నీవిట్లనకుము, నీ మాట దురాచార పూరితము. నీవు వివాహము కాని బాలవు.
నాకు గురుపుత్రికవు మనము సోదరీసోదరులము, నీవు మన్మధ పరవశురాలవై ఇలా అనుచితముగా పలుకుచున్నావు. నేను నీతో
రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెప్పుచున్నాను. ఇట్టి పాపము చేసిన
మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసియుండును. కావున యింటికి పోదమురమ్ము, గురువుగారు మనకై
ఎదురు చూచుచుందురు. ఆలస్యమైనచో నిన్ను దండింపవచ్చును. సమిధలు, దర్భలు మున్నగు వానిని గొనిపోదము రమ్ము అని
పలికెను.
గురుపుత్రిక ఆ మాటలను విని ఓయీ! కన్యారత్నము, సువర్ణము. విద్యాదేవత, అమృతము స్వయముగ
చెంతకు చేరినపుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరము కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికిరాను. నేనిచటనే
నాప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్లి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని యీ
శరీరమునొల్లను. ఇచటనే యీ శరీరమును విడిచెదను. నీవింటికిపోయి దీని ఫలితము అనుభవింపుము అని నిష్టురముగ
మన్మధావేశముతో మాటలాడెను. సుమిత్రుడును యేమిచేయవలెనో తెలియని స్థితిలోనుండెను. చివరకాతడు గురుపుత్రిక
కోరికను దీర్చుటకంగీకరించెను. వారిద్దరును పద్మములతో పుష్పములతో ఎగురుటాకులతో మన్మధశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ
వాతావరణములో యధేచ్చా సుఖములననుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తరువాత సమిధలు మున్నగువానిని దీసికొని
గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు మున్నగు వానిని చూచి యానందపడెను. పుత్రికను చూచి నీవు చాల
అలసినట్లున్నావు, మధురాహారమును తిని విశ్రాంతినందుమని లోనికి పంపెను. ఆమెయు అట్లేయనిలోనికెగెను.
తండ్రియామెను కాశ్మీరదేశవాసియగు బ్రాహ్మ్ణునకిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై
బడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడును మిగుల దుఃఖించెను. అయ్యో! సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన
వైధవ్యము కలిగినదేమి? ఈమెకిట్టి బాధను కల్పించిన ఆ బ్రహ్మయెంత మూర్ఖుడో కదా అని పలువిధములుగా దుఃఖించుచుండెను.
ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచుండగా దృడవ్రతుడను యోగి ఆ ప్రాంతమున దిరుగుచు సుదేవునిరోదనధ్వనిని విని వాని
వద్దకు వచ్చి 'జ్ఞానస్వరూపా! నీ దుఃఖమేమియో చెప్పుము. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన
దుఃఖకారణమును చెప్పి మరల దుఃఖించెను. యోగి సుదేవును, భార్యపుత్రికలను చూచి క్షణకాలము ధ్యానయోగము నందియిట్లు పలికెను.
ఓయీ! వినుము నీ కుమార్తే పూర్వజన్మలో క్షత్రియకులమున జన్మించినది. వ్యభిచారిణియై చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి
యౌవన వతి యగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసికొనెను.
ఈమె పతిహత్యను, ఆత్మహత్యను చేసినది. ఆ రోషమువలన నీమెకీ జన్మమున యిట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి యీమె పవిత్రమైన నీ
వంశముననెట్లు జన్మించినదాయని నీకు సందేహము రావచ్చును. దానికిని కారణము కలదు వినుము. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున
సరస్వతీ నదీతీరమున గౌరీవ్రతము నాచరించువారితో కలసి వారు యిసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచుండగా నీ
వ్రతమును చూచినది. ఆ పుణ్యము బలమున నీమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందునుస్వేరిణియై నీ శిష్యులతో
అధర్మముగ రమించెను. ఈ దోషమువలన నీమె తమ కర్మఫలముల యిట్లననుభవించుచున్నది చేసిన కర్మము ననుభవింవింపక
తప్పదు కదా!
సుదేవుడు యోగిమాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య, ఆత్మహత్యలకు పాల్పడుబదును. ఈ జన్మలో
కన్యయై సోదరుతుల్యుడైన తన శిష్యునితో రమించుటనువిని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి 'తండ్రీ! నా కుమార్తే చేసిన
పాపముయేమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుటయేట్లు జరుగును? దయయుంచి చెప్పుడని పరిపరివిధముల ప్రార్థించెను.'
అప్పుడా యోగి 'ఓయీ విద్వాంసుడా! నీ కుమార్తె చేసిన పాపములుపోవుటకు, ఆమె మాంగళ్యము నిలుచునట్లును చేయుటకొక
ఉపాయముకలదు. శ్రద్ధగావినుము మాఘమాసమున ప్రాతఃస్నానముచేసి ఆ నదీతీరమునగాని సరస్సు తీరమున యిసుకతో గౌరీదేవిని జేసి
షోడశోపచారములతో పూజింపవలయును. సువాసినులకు దక్షిణతో నా గౌరీదేవిని సమర్పించవలయును. ఈ విధముగ నీమచే
ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ద
తదియనాడు రెండు క్రొత్తచెటలను తెచ్చి వానిలో చీర, రవికలగుడ్డ, ఫలపుష్పాదులు, పసుపుకుంకుమ మున్నగు సువాసిని
అలంకారములనుంచి దక్షిణ తాంబూలములతో వాయనము నుంచి సువాసినీపూజచేసి ముత్తైదువలకిచ్చి ఏడుమార్లు ప్రదక్షిణ నమస్కారముల
నాచరింపజేయుము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయును. మాఘమాసమున ప్రాతఃకాలస్నానముల చేతను పైన చెప్పిన
వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగళ్యము నిలుచును. మాఘస్నానము చేసిన
విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరివ్రతమాచైంచిన సువాసిని తన మాంగళ్యమును నిలుపుకొని
చిరకాలము సుఖించును. పిచ్చివారు, మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టి వారైనను వారియనుహ్రహమునొంది చిరకాలము సుఖించి
పుణ్యలోకముల నందుదురు. అని యోగి వివరించి తన దారినబోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానమును,
గౌరీ పూజా విశిష్టమైన కాత్యాయనీ వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయనీ వ్రత మహిమ చేత సుదేవుని కుమార్తె
పాపములుపోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యెను. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోను, భర్తతోను కలిసి
దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమున ప్రాతఃకాల స్నానము నదిలోగాని, సరస్సునగాని, కాలువలోగాని చేసి తీరమున శ్రీహరి
నర్చించినవారు, సుదేవుని పుత్రిక వంటివారైనను యిహమున సర్వసుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమాయని
శివుడు పార్వతీదేవికి మాఘస్నాన మహిమను వివరించెను
Read More

మాఘ పురాణం - 4

మాఘ పురాణం - 4
4వ అధ్యాయము - సుమిత్రునికథ
పార్వతీదేవియు శివునిమాటలను విని
స్వామీ మరి గురుకన్యా
సంగమము చేసిన ఆ సుమిత్రుడు,
సుదేవుని
శిష్యుడు అతడేమయ్యెనో వాని
వృత్తాంతము నెరుగగోరుచున్నా
ను, దయయుంచి దానిని వివరింపుడని
కోరగా శివుడిట్లు పలికెను.
పార్వతీ! సరియైన ప్రశ్ననడిగితివి
వినుము. సుదేవుని
శిష్యుడును తాను చేసిన
గురుపుత్రికా
సంగమమునకు పశ్చాత్తాపపడెను,
చనిపోదునని గురుపుత్రిక
బెదిరించుటచే భయపడి ఆమెతో
వ్యభిచరింతినని
అతడు బాధపడుచుండెను.
తుదకు తనలోని బాధను భరింపలేక
గురువు వద్దకు వచ్చి నమస్కరించి
యిట్లుపలికెను. గురువర్యా!
పూర్వము నేను మీ వద్ద
చదువుచున్నప్పుడ
ొకనాడు సమిధలు మున్నగువాటికై
అడవికి మీ ఆజ్ఞచేపోతిని. మీ
కుమార్తెయు బంతితోనాడుకొనుచ
ు నాతో మీరు చూచుచుండగానే
అడవికి వచ్చినది. అచట నిర్జనమైన
ఏకాంత మనోహరప్రదేశమున
నన్ను తబకోరిక తీర్చవలసినదిగ
బలవంతపెట్టినది.
నేనందుకు అంగీకరింపలేదు.
అప్పుడామె ఓయీ! నీవు నామాటవిని
నన్నుకూడనిచో నేనిచట నా
ప్రాణములను విడిచెదను అనగా
బలవంతముగ నాత్మహత్య
చేసికొందును. నేను లేకుండ
నీవింటికి పోయినచో నాతండ్రి
నా కుమార్తె యెక్కడయని అడిగిన
నీవేమని చెప్పగలవు. నీ గురువైన నా
తండ్రి నాయందలి ప్రేమచే
నిన్ను తప్పక శపించును.
మూర్ఖుడా!
యిప్పటికైనను నన్ను పొంది
సుఖించుము. నన్ను వేగముగ
కౌగలించుకొనుము రమ్ము. నా
కోరికను దీర్చుమని యనేక విధములుగ
నిర్భందించినది. నేనును మీ
శాపమునకు భయపడి ఆ అరణ్యమున నీ
పుత్రికతో రమించి ఆమెకోరికని
తీర్చితిని. తరువాత నీ
విషయమును మీకు చెప్పుటకు భయపడితిని.
మీకుమార్తె చేసిన ద్రోహమువలన
నేను పాపమును పొందితిని.
దయయుంచి క్షమించి నీ
పాపమునకు ప్రాయశ్చిత్తమున
ు బోధింపుడని ప్రార్థించెను.
సుమిత్రుని మాటలను విని
సుదేవుడు కొంతసేపు విచారించి
యిట్లు పలికెను. ఓయీ! నీవు యితరుల
ఒత్తిడికిలోనై చేసిన
పాపమునకు ప్రాయశ్చిత్తము నడుగుచున్నావు.
వినుము అన్ని నదులలో మిక్కిలి
యుత్తమ నదియైన
గంగాతీరమునకు పోయి
పన్నెండు సంవత్సరముల
పాటు తపమాచరింపుము. అదియే
నీకు తగిన ప్రాయశ్చిత్తమని
పలికెను. శిష్యుడైన
సుమిత్రుడును గురువుచెప్పిన
యుపదేశమును పాటించి
గంగాతీరమునకు ప్రయాణమయ్యెను.
అతడు తన ప్రయాణములో ఒకచోటనొక
దివ్యమైన ఆశ్రమమును జూచెను.
ప్రయాణము చేయవలసిన యతడు అచట
విశ్రమించదలచెను.
అచటివారందరును శిష్యులు,
మిత్రులు,
కుటుంబసభ్యులు మున్నగువారితో
మాఘస్నానముచేసి శ్రీహరిని ఆ
సరస్సు తీరమున పూజించి
మాఘపురాణమును వినుచుండిరి.
సుమిత్రుడును వారికి నమస్కరించి
మీరు చేయువ్రతమెట్టిద
ి దయయుంచి వివరింపుడని
ప్రార్థించెను. ఈ
వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో
నేలోకముకల్గును.
మీరు పూజించునది
యేదైవమును దయయుంచి చెప్పుడని
యడిగెను. వారు సుమిత్రుడడిగిన
ప్రార్థన విని తమలోనోకడైన
సత్యవ్రతుడను వానిని
విషయము వివరింపుమని
నియమించిరి.
సత్యవ్రతుడు సుమిత్రునితో
ఇట్లు పలికెను, ఓయీ శ్రద్దగా
వినుము. సూర్యుడు మకర రాశిలో
నుండగ మాఘమాసమున
ప్రాతఃకాలమున నది,
సరస్సు మున్నగువానియందు
స్నానముచేసినవాడు శ్రీహరికి
యిష్టుడగును. ఇట్లు మాఘమున
ప్రాతఃకాలస్నానము చేసి తీరమున
శ్రీహరిని అర్చించి శ్రీహరి
మహిమను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట
పుణ్యప్రదమైన వ్రతము. మాఘ
స్నానము మానినవాడు సత్యశౌచములను విడిచినవాడు,
పరులనునిందించువాడు,
బ్రహ్మహత్యచేసిన వానితో
సమానులు, అబద్దపుసాక్ష్యమ
ును చెప్పినవాడు,
దురాచారుడు స్త్రీ
సాంగత్యలోలుడు మాఘమాసస్నానము మానినవాడు,
బ్రహ్మహత్యచేసిన వానితో
సమానులేయగుదురు.
తోటలను కూల్చినవాడు, కన్యలను,
అశ్వములను అమ్మినవాడు,
చెరువుగట్టును తెగ కొట్టినవాడు,
పరస్త్రీ సాంగత్యము కలవాడు,
దేవద్రవ్యము నపహరించువాడు,
తానిచ్చిన దానినే
దొంగలించువాడు,
మద్యపానలోలుడు,
ఆడినమాటను తప్పినవాడు, పెద్దలను,
దేవతలను,
బ్రాహ్మణులను ద్వేషించువాడు,
దేవునికి నివేదన చేయని
అన్నమును తినువాడు,పితృశేషాన్న
భోజనుడు, సోదరుని భార్యతో
రమించువాడు, అసత్యభాషణుడు,
భుజించుచు అపవిత్రుల
మాటలను వినువాడు, పురాణ
శ్రవణమును, వివాహాది
శుభకార్యములను పాడుచేయువాడు,
తల్లిదండ్రులను దేషించు వాడు,
వీరందరును పాపాత్ములే సుమా.
మేము చేయుచున్న యీమాఘమాస
వ్రతమును పాటించినచో యీ పాపుల
బుద్ధులు మారి పరిశుద్ధులై
పుణ్యములనందుదురు.
మాఘస్నానము చేసి తీరమున
తులసీదళములతో మాధవునర్చించిన
వాని పుణ్య అమితమైనది సుమా.
వ్రతాంతమున
చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ
వ్రత మాచరించిన వానికి పునర్జన్మ
యుండదు అని
సత్యవ్రతుడు మాఘస్నానవ్రత
ఫలమును పెక్కువిధములుగ
వివరించెను.
సుమిత్రుడును వారికి తాను చేసిన
పాపమును, గురువు చెప్పిన
ప్రాయశ్చిత్తమును వివరించెను.
అప్పుడు వారు మాఘస్నానమును మూడు దినములు చేసిన
సర్వపాపములు నశించును. కావున యీ
మాసమున
యింకను మూడుదినములు మిగిలియున్నది.
ఈ
మూడుదినములును మాఘస్నానమాచరించ
ి ప్రాయశ్చిత్తముగ గంగాతీరమున
తపము చేయుమని
సుమిత్రునకు హితము పలికిరి.
సుమిత్రుడును వారి
మాటప్రకారము మాఘమాసము చివరలో
మిగిలిన
మూడు దినములును మాఘస్నానమును చేసి
గంగాతీరమునకు పోయి
ప్రాయశ్చిత్త తపమునారంభించెను.
నిశ్చలమైన అతని తపము తీవ్రమై
వర్ణింప రాని తీరులోనుండెను. ఈ
విధముగా
పన్నెండు సంవత్సరములు గడచినవి.
అయినను మానక
అతడిట్లు తపమాచరించుచు చక్రపాణియగు,
శ్రీ హరి కృపావిశేషమునంది
అనుగృహీతుడై మాఘస్నాన
ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే
కేవల ప్రాయశ్చితమునేగాక,
మోక్షమును కూడా పొందెను.
పార్వతీ నీవడిగిన సుదేవ
శిష్యుడగు సుమిత్రుని
వృత్తంతమును పూర్తిగ
చెప్పితిని. సుమిత్రుని
పాపవినాశమును, పుణ్యప్రాప్తిని
వివరించు యీ
కథను మాఘస్నానము చేసినవాడు.
శ్రీహరి పూజానంతరము ఒకసారి
చదివినను వైకుంఠమును చేరును.
వాని పితృదేవతలును తమ
పాపములను పోగొట్టుకొని
వైకుంఠమునందుదురు.
చందోవిహీనమైన మంత్రము,
ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన
పూజాదులు లేని ధర్మాచరణ
వ్యర్థములు సుమా అని
శివుడు పార్వతికి వివరించెను.
Read More

మాఘ పురాణం - 9

మాఘ పురాణం - 9
9వ అధ్యాయము - గంగాజల మహిమ
ఓ కార్తవీర్యార్జునా! శివపూజ
గురించి
శివమహత్మ్యమును గురించి
వివరించెదను వినుము.
మున్ను శ్రీరామచంద్రుడు
రావణుని చంపుటకు సముద్రముపై
వారధి కట్టినచోట
శివలింగమును ప్రతిష్టించి
శివుని ధ్యానించి, వారధిదాటి
రావణుని చంపెను. అటులనే
హనుమంతుడూ సముద్రమును దాటునపుడు శివుని
ధ్యానించి రామునికి
నమస్కరించి, మహా
బలమును సంపాదించి
సముద్రమునుదాటెను.
అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే
ముందు శివపూజ చేసియే
యుద్ధరంగములో ప్రవేశించును.
మరెందరో మహానుభావులు శివుని
ధ్యానించి
జయము చేకూర్చుకొనిరి.
స్త్రీలు తమ
మనోవాంచలను తీర్చుకొనిరి. కనుక,
పూజదు శివపూజ పవిత్రమైనది. అటులనే
నదులలో గంగానది పరమపవిత్రమైనది.
ఎటులనగా,
గంగాజలము విష్ణుపాదములనుండి
పుట్టినదియు, శివుని
శిరస్సునుండి ప్రవహించునట్టిద
ియు అయినందుననే సర్వపాపహరమైనది.
గంగా జలములో స్నానమునకు అంత
ప్రాముఖ్యత ఉన్నది.
ఇంకనూ గంగాజలము గురించి
చెప్పబోవునది ఏమనగా యే
నీళ్ళనుగాని, "గంగ గంగ గంగ" అని
మూడు పర్యాయములు అనుకొని
శిరస్సున చల్లుకొనినచో ఆ
నీళ్ళు గంగాజలముతో
సమానమయినవగును.
గంగాజ్లము విష్ణుమూర్తి ప్రతి
రూపము కనుక, మాఘమాసములో
అంగాస్నానము అత్యంత
పుణ్యప్రదమని తెలుపుచూ గంగా జల
మహత్మ్యము గురించి
కార్తవీర్యార్జు
నకు దత్తాత్రేయుదు వివరించెను.
కొంత కాలము క్రిందట
మగధరాజ్యములో పురోహితవృత్తిచే
జీవించుచున్న
నలుగురు బ్రాహ్మణులుండిరి.
నలుగురికి
నలుగురు కుమార్తెలుండిరి.
వారు నిండు యవ్వనవతులై ఉండీరి.
కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో
స్నానం చేయుటకు ఒక గురుకుల
విద్యార్థి వచ్చెను, బ్రాహ్మణ
కన్యలాయువకుని అందము చూచి,
మోహించి, అతనిని సమీపించి
చుట్టుముట్టి
మమ్ములను వివాహం చేసుకోమని
బలవంతము చేయగా ఆ బ్రాహ్మణ
విధ్యార్థికి విద్య పూర్తి
కానందున వారి
కోర్కెలను నిరాకరించెను. అంత ఆ
కన్యలు కోపంతో నీవు పిశాచానివి
కమ్మని శపించగా, ఆ
విధ్యార్థియూ, మీరుకూడ
పిశచులగుదురుగాక అని ప్రతి
శాపమిచ్చుటచే వారంతా పిశాచ
రూపములతో ఆ కొలను వద్దనే వుండి,
అందరిని బాదించి,
ఆహారము దొరికితే వాటాలకై
పెనుగులాడుకొనుచుండిరి.
కొంతకాలమునకు ఒక
సిద్దుడాకోనేటి దగ్గరకురాగా నా
పిశాచముల తల్లి దండ్రులు, తమ
బిడ్డలకు కలిగిన పిశాచ
రూపములెట్లు పోవునని అడిగిరి. ఆ
సిద్దుడు వారందరిచేత
మాఘమాసములో గయలోనున్న
త్రివేణిలో
స్నానము చేయించినచో వారికున్న
పిశాచ రూపములు తొలగిపోవునని
చెప్పగావారట్లు చేయుటచే
అయిదుగురికి యధా
రూపములు కలిగినవి.
ఇట్లు జరుగుటకు మాఘమాసమహత్మ్యమే
కారణము. మాఘమాస మందలి నదీ
స్నానము మనుజులకే కాక దేవతలకు,
గంధర్వులకు కూడ పవిత్రమైనది.
ఓక మాఘమాసములో నొకగంధర్వుడు తన
భార్యతో భూలోకానికి వచ్చి
గంగానదిలో స్నానమాడెను. అతని
భార్య మాత్రము స్నానమాచరింనని
చెప్పుటచే ఆమెకు దైవత్వము నసించి
గంధర్వలోకానికి వెళ్ళలేకపోయినది.
ఆమెను విడిచి పెట్టి ఆ
గంధర్వుడొకడే వెళ్ళిపోయాడు.
ఆమె అడవిలో
తిరుగుచూ విస్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి
వయ్యారముగా క్రీగంటచూసెను.
ఆమె అందానికి, యవ్వనానికి
విస్వామిత్రుడు తన్మయుడై
ఆమెను ప్రేమించుటచే
యిద్దరూ కామక్రీడలలో
తెలియాడుచుండగా, మరల ఆ
గంధర్వుడు తన
భార్యను వెదుకుచూ వచ్చి చూడగా,
విస్వామిత్రుడు గంధర్వస్త్రీ
క్రీదించుచుందిరి. ఆ
దృస్యమును చూచి
మందిపడుచు తపస్వివై యుండి
కూడా యిలా కామతృష్ణ
కలవాడవైనందున, నీకు కోతి
ముఖము కలుగుగాకయని
విస్వామిత్రుని, పాషాణమై
పడియుండమని భార్యను శపించి
వెళ్ళిపోయినాడు.
విస్వామిత్రుడు చేయునది లేక
వానర ముఖం కలిగియుండగా
నారదుడు ఆ విషయము తెలుసుకొని
విశ్వామిత్రుని కడకు వచ్చి, "
విశ్వామిత్రా! క్షణభంగురమైన
తుచ్ఛకామ వాంఛకులోనై నీ
తపశ్శక్తినంతా వదులుకున్నావు.
సరేలెమ్ము గంగానదిలో
స్నానము చేసి, నీ కమండలములో
గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై
చల్లుము", అని వివరించగా
విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి
, విష్ణువును ధ్యానించి,
కమండలముతో నీరు తెచ్చి,
పాషాణముపై చల్లగా ఆ రాయి
పూర్వం గంధర్వ శ్త్రీ
రూపమును పొంది,
గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను.
పూర్వరూపము నందిన
విస్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.
Read More

మాఘ పురాణం - 8

మాఘ పురాణం - 8
8వ అధ్యాయము - దత్తత్రేయుడు కార్తవీర్యార్జు
నకు ఉపదేశమిచుచుట
దత్తత్రేయుడు బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల యొక్క
అంశమున జన్మించినాదు. అతడు కూడ లోక
కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు,
త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు.
దత్తత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ
వీరుడు 'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని
పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు,
ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని
ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి "గురువర్యా! మీ
అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని, కాని
మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు.
కావున, మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస
ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను, అని
దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని
కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.
"భూపాలా! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమనమైన
నదులు ప్రపంచమండెచ్చటనూలేవు. ఈ నదులలో
ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర
ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క
సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా
నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల
యందు స్నానము చేసి దానధర్మములచరించిన యెడల దానివలన
కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు.
అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన
గొప్పఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ
కలుగును. గనుక, యే మానవుడైననూ మాఘమాసములో
సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి, ఒక
సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో
పంచమహపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు", అని
దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా
చెప్పుచున్నాడు. "పూర్వకాలమున
గంగానదీతీరపు ఉత్తరభాగమున
భాగ్యపురమను పట్టణము కలదు.
అందు నివసించు జనులు కుబేరులువలెనున్నారు. ఆ
నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప
ధనవంతుదు, బంగారునగలు, నాణేములు రాసులకొలది
ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను,
తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని
భాగములు చేసి పంచుకొని, యిష్టమువచ్చినటుల
పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి,
కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో
ఉద్యానవనములో విహరించుచుండగా
కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట
నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు, ఆ విధముగా హేమాంబరుని
కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ
యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి
జాబితాలను చూసి, పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు.
రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు.
అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.
"అయ్యా! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక
విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి
నరకమును, నాకు స్వర్గమును యేల ప్రాప్తించును" అని
అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు " ఓయీ వైశ్యపుత్రా!
నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో
సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి
వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా
నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి.
అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ
మిత్రుడు బ్రాహ్మణుడు, ప్రతి నిత్యము బ్రాహ్మణ
దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును.
కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది.
అదియ్తునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ
మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ
శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున
నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని
చిత్రగుప్తుడు వివరించెను. ఆహా! ఏమి నా
భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి
మోక్షము కలిగినదా" అని వైశ్యకుమారుడు సంతసించి,
దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.
Read More

Powered By Blogger | Template Created By Lord HTML