What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Showing posts with label ఉపయోగకరమైన మంత్రములు. Show all posts
Showing posts with label ఉపయోగకరమైన మంత్రములు. Show all posts

Friday, 20 September 2013

వివాహం సకాలంలో జరగటానికి ఏదైనా మంత్రం వుందా?

వివాహం సకాలంలో జరగటానికి ఏదైనా మంత్రం వుందా?
మూలమంత్రం : 'ఓం ములీ ములీ మహాములీ సర్వం సంక్షోభయ ఉపద్రవేభ్యః స్వాహా '. శుక్రవారం లేదా శనివారం తలస్నానం చేసి ఇష్ట దైవం ముందు కూర్చొని 108 సార్లు ద్యానించాలి.
Read More

సంతానవంతులు అగుటకు ఏ జపాన్ని చేయాలి?

సంతానవంతులు అగుటకు ఏ జపాన్ని చేయాలి?
' ఓం జగత్పతి నమో నమః ' అని ఇరువురు శుచియై పడుకోవటానికి ముందు మూడుసార్లు ధ్యానిస్తే త్వరగా సంతానవంతులవుతారు.
Read More

Monday, 12 August 2013

కొన్ని మూల మంత్రములు :

కొన్ని మూల  మంత్రములు :

గణపతి మంత్రం :

"ఓం గం గణపతయే నమః "
దీపారాధనకు 2 అంగుళాలు ఎత్తు కల కుంది, రాగి  పాత్రలో మంచి నీరు,2- వత్తులు, దీపారాధనకు కొబ్బరి నూనె  వాడుట  మంచిది. గణపతి జపము, మొదలు పెట్టునపుడు, గణపతి వాహనము ఎలుకను చూస్తూ మొదలు పెట్టాలి . జపం తరువాత మంచి నీరు నైవేద్యం ఇవ్వాలి .

మహా లక్ష్మి మంత్రం  :

"ఓం శ్రీం హ్రీం హ్రీం  శ్రీం "
దీపారాధనకు 4 వత్తులు, ఆవునెయ్యి , జపం తరువాత నీటి నైవేద్యం చాలు .

విష్ణు మూర్తి :

" ఓం నమో నారాయణాయ "
దీపారాధనకు 4 వత్తులు, ఆవునెయ్యి లేదా నువ్వుల నెయ్యి , జపం ముందు ఆది శేషుని కి , జపం ప్రారంభించాలి,  తరువాత నీటి నైవేద్యం చాలు .

దుర్గ దేవి :

"ఓం అం హ్రీం క్రోం శ్రీం సౌహ్ ధుమ్ దుర్గాయై నమః "
దీపారాధనకు 2,4,9 వత్తులు వాడవచ్చు,  ఆవునెయ్యి , ఆముదం వాడవచ్చు దీపరదనలో,  జపానికి ముందు వాహనమిన పులిని కాని , సింహమును కాని ప్రార్ధించి, జపం మొదలు పెట్టాలి, జపం తరువాత నీటి నైవేద్యం చాలు

దుర్గా గాయత్రి :

" ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః  ప్రచోదయాత్ "
దీపారాధనకు 2 లేదా 4 అంగుళాలు ఎత్తు కల కుంది, రాగి  పాత్రలో మంచి నీరు,2 లేదా 4 లేదా 9- వత్తులు వాడవచ్చు , దీపారాధనకు కొబ్బరి నూనె  వాడుట  మంచిది. గణపతి జపము, మొదలు పెట్టునపుడు, ముందు వాహనమిన పులిని కాని , సింహమును కాని ప్రార్ధించి, జపం మొదలు పెట్టాలి, జపం తరువాత నీటి నైవేద్యం చాలు
Read More

Sunday, 11 August 2013

Wednesday, 19 June 2013

శివ మంత్రము

శివ మంత్రము
యజుర్వేము.4.5.8.1
ఓం నమః శంభవేచ మయోభవే చ నమః శంకరాయ చ
మయస్కరాయ చ నమః శివాయచ శివతరాయచ!! ఓం.

ఇది యజుర్వేదంలో మధ్యభాగమైన శ్రీ రుద్ర సూక్తంలో వచ్చే మంత్రం
చతుర్వేదాలలో ''జీవనాడిగా'' కొనియాడబడుచున్న ''నమః శివాయ'' అనే
పంచాక్షరి మంత్రం ఈభాగంలోనే నిక్షిప్తమైయున్నది.

సమస్త హిందూ,వైదిక ధర్మావలంబులు, కేవలం ఈమంత్రంతో చిన్న చెంబెడు మంచినీళ్లు
శివ లిగంమీద పోస్తే చాలు సంతో షించి, సమస్త సద్భక్తుల కోరికలు నెరవేర్చే వాడు ఈ
బోళా శంకరుడు.
ఓం నమః శివాయ.
Read More

Monday, 17 June 2013

ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు :

ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు :

" ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణియం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ "

ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు. ఇంతటి మహోన్నతమైన మంత్రములో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి దాగి ఉంటుందని పురాణ వచనం. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ 24మంది దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు సిద్ధిస్తాయి. ఈ 24 అక్షరాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లను తెలుసుకుందామా...

1. తత్ – గణేశ్వరుడు 
2. స - నృసింహ భగవానుడు 
3. వి – విష్ణుదేవుడు
4. తుః – శివదేవుడు
 5. వ - కృష్ణ భగవానుడు 
6. దే - రాథా దేవి
7. ణ్యం – లక్ష్మీదేవి 
8. భ – అగ్నిదేవుడు
 9. ర్గః – ఇంద్రదేవుడు
10. దే – సరస్వతి 
11. వ – దుర్గాదేవి 
12. స్య – హనుమంతుడు
13. ధీ – పృధ్వీదేవి 
14. మ – సూర్యదేవుడు
 15. హి - శ్రీరాముడు
16. ధి – సీతామాత 
17. యో – చంద్రదేవుడు 
18. యో – యమదేవుడు
19. నః – బ్రహ్మదేవుడు
 20. ప్ర – వరుణదేవుడు 
21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు 
23. యా – హంసదేవత 
24. త్ - తులసీదేవి

మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, సుఖసంతోషాలు వనగూరుతాయి. ప్రపంచ మానవాళి గాయత్రీ మంత్రాన్ని జపించి తరిస్తోంది.
Read More

శ్రీహరిని ప్రతినిత్యం కొలిచిన వారికి మోక్షమార్గములు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

"జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్టి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముక్దునః 2"

ఓ దేవకీ నందనా..! ఓ వృష్టివంశ మంగళ దీపమా..! సుకుమార శరీరుడా..! మేఘశ్యామ! భూభారనాశక ముకుంద! నీకు సర్వదా జయమగుగాక!

అనే మంత్రముతో శ్రీహరిని ప్రతినిత్యం కొలిచిన వారికి మోక్షమార్గములు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.
Read More

Monday, 10 June 2013

గాయత్రీ మంత్ర వైశిష్ట్యం--- వేద మాత గాయత్రి

 
 ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః
యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే

తాత్పర్యము:

ముత్యపు వర్ణము, పగడపు వర్ణము, బంగారపు వర్ణము, నీలవర్ణము, తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు, ప్రతిముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు, చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు, వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవిని సేవించెదను - సంధ్యావందనము

(గుంటూరు జగద్గురు పీఠం, వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ వారి పర్యవేక్షణలో డాక్టర్ జి.ఎల్.ఎన్. శాస్త్రి గారు వివరించిన 'గాయత్రి మంత్రము' అనే ప్రచురణ నుండి)

భారతదేశమందు పూర్వకాలములో ఐదు దేవతారాధనములుండేవి. 1. గాణాపత్యము 2. సౌరము 3. శాక్తేయము 4. శైవము 5. వైష్ణవము. వీటిని అనుసరించే వారి మధ్య అవగాహన కన్నా పరస్పర విద్వేషమే ఎక్కువగా ఉండేది. ఒకరి దేవతను ఇంకొకరు ఆరాధించే వారు కాదు. కానీ, వీరందరూ ఆరాధించుటకు అభ్యంతరములేని ఒకే ఒక దేవత గాయత్రి. అట్టి వైశిష్ట్యము గాయత్రీమాతకు ఉన్నది. (దీనికి కారణం గాయత్రీ మాత ధ్యానమునకు సంబంధించిన "ముక్తావిద్రుమ హేమనీలధవళచ్ఛాయైః ముఖైః.." అనే శ్లోకములో పంచ వర్ణముల పంచముఖములను ఈ ఐదు దేవతలకు ప్రతీకగా తీసుకొనినప్పుడు పరస్పర విద్వేషము తొలగి సమన్వయము, అవగాహన కలిగినదేమో. ఋషులు, పురాణోపనిషత్తులు తెలిపే ఈ క్రింది శ్లోకపాదములను బట్టి గాయత్రీ మాత వైశిష్ట్యం మరింత స్పష్టమవుతుంది.

గాయత్రీం చింతయేద్యస్తు హృద్పద్మే సముపస్థితాం
ధర్మాధర్మ వినిర్ముక్త స్సయాతి పరమాంగతిం

భావము: గాయత్రిని హృదయములో ఉపాసించువాడు లేదా ధ్యానించువాడు ధర్మాధర్మ విచికిత్స చేత బంధింపబడకుండా మోక్షమును పొందును - వేదవ్యాస మహాముని

గాయత్రీ వేదజననీ గాయత్రీ లోకపావనీ
న గాయత్ర్యాః పరం జప్యం ఏతద్విజ్ఞానముచ్యతే

భావము: గాయత్రియే వేదమాత, త్రిలోకవాసులకు జ్ఞానమును ప్రసాదించే పావని. సర్వోత్కృష్టమైన గాయత్రీమంత్ర జపమును మించినది మరొకటి లేదు - కూర్మపురాణము

గాయత్ర్రీంచైవ వేదాంశ్చ తులయో సమతోలయన్
వేదా ఏకత్ర సాంగాస్తు గాయత్రీచైకత స్థితా

భావము: నాలుగు వేదములను, ఆరు వేదాంగములను త్రాసు యొక్క ఒక పళ్లెమందు, గాయత్రీ మంత్రమును రెండవ పళ్లెమునందు ఉంచి తూచినచో గాయత్రి వైపే త్రాసు మొగ్గును - యాజ్ఞవల్క్యుడు

న గాయత్ర్యాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్

భావము: తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు - ఆర్యోక్తి

చత్వారో వేదాస్సాంగాస్యోపనిషదస్సేతిహాసాః సర్వే గాయత్ర్యాః ప్రవర్తంతే

భావము: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, ఇతిహాసములన్నియు గాయత్రి వలననే ప్రవర్తించును - గాయత్రీ ఉపనిషత్తు

గాయత్రీ మాత్ర నిష్ఠస్తు కృతకృత్యో భవేద్విజః

భావము: ఒక్క గాయత్రీ మంత్రమును నిష్ఠతో ఉపాసించిననూ ఇతర ఉపాసనల ప్రమేయము లేకుండానే ద్విజుడు కృతార్థుడగును - గాయత్రీ రహస్యం

సర్వాత్మనాహి యాదేవీ సర్వ భూతేషు సంస్థితా
గాయత్రీ మోక్షహేతుర్వై మోక్షస్థానక లక్షణమ్

భావము: సర్వభూతములందు అంతర్యామినియై వర్తించు గాయత్రియే మోక్షస్వరూపము, మోక్షప్రసాదినియై యున్నది - ఋష్యశృంగుడు

యా వేదాదిషు గాయత్రీ సర్వవ్యాపీ మహేశ్వరీ
ఋగ్యజుస్సామధర్వైశ్చ తన్మేమన శ్శివ సంకల్పమస్తు

భావము: అన్ని వేదములలో ప్రతిపాదింపబడిన గాయత్రి సర్వ మానవుల బుద్ధులయందు మంగళకరములైన సంకల్పములు కలిగించును.- మహాన్యాసము

గాయత్రీ అలంకారంలో బెజవాడ కనకదుర్గమ్మ

ఇతర మంత్రములకన్నా గాయత్రీ యేల విశిష్టమైనది?

ఏ మంత్రమైనా కూడా బుద్ధి జీవి యైన మానవునకు మాత్రమే ఉపయోగపడును. బుద్ధిని పెట్టి మననము చేసినప్పుడు మాత్రమే మంత్రమగును. బుద్ధిని ఉపయోగించి ఉచ్చరించిన అక్షరము బీజాక్షరమగును.

ఉదాహరణ: క్రీం అన్నది కాళీ సంబంధమైన బీజాక్షరం. వేసవికాలంలో ఐస్ క్రీం అమ్ముకునే వాడు రోజులు వేయిమార్లైనా "క్రీం" అన్న అక్షరాన్ని ఉచ్చరించును. అయినను అది అతనికి బీజాక్షరమవదు. బుద్ధి పెట్టినప్పుడు మాత్రమే అది బీజాక్షరమై కాళీమాతతో సంబధమేర్పడును. అలాగే, ప్రెస్ లో మంత్రశాస్త్రమును అచ్చు వేసే కంపోజర్, ప్రూఫ్ రీడర్ కూడా ఈ అక్షరాన్ని చదువుతారు. కానీ అది వారికి బీజాక్షరముగా పనిచేయదు. కాబట్టి, బీజాక్షర మగుటకు, మంత్రము వలె పనిచేయుటకు బుద్ధి అవసరమని తెలియుచున్నది. ఈ బుద్ధి కూడా పెడదోవ పట్టనిదై యుండవలెను. బుద్ధులు పెడదోవ పట్టకుండా ప్రచోదనము చేయనది గాయత్రీ మంత్రము. కాబట్టి, ముందుగా సద్బుద్ధికై గాయత్రీ మంత్ర పఠనము చేసి అటుపైన కలిగిన సద్బుద్ధితో మిగిలిన ఇతర మంత్రములను పఠించిన ఫలితము కలుగును. ఈ కారణము వలన మిగిలిన మంత్రముల కన్నా ముందుగా గాయత్రీ మంత్ర పఠనము చేయవలెనని చెప్పబడినది. అంతేకానీ, గాయత్రి ఒక్కటియే మంత్రము, మిగిలినవి పనికిరానివి అని కాదు.

అదే విధముగా తల్లిని దైవముగా ఆరాధించిన తరువాత మిగిలిన ఏ దైవమును ఆరాధించినను ఫలితముండును. దైవముగా చూడవలసిన వారిలో మొదటి స్థానము మాతృమూర్తిదే. ధ్యాన, జప, సంకీర్తన, స్తోత్ర పూజాదులలో ఏ విధముగానైనా దైవారాధన చేయవలెనన్న కావలసినది పంచ జ్ఞానేంద్రియములతో కూడిన దేహమే కదా! ఆ దేహమును ఇచ్చునది తల్లియే కదా! కాబట్టి అన్ని దైవారాధనలకన్నా ముందు తల్లిని దైవముగా భావించి పూజించుట ఆవశ్యకము, ఉత్తమము. అందుచేత, మంత్రములలో గాయత్రిని తల్లిగా పోల్చిరి. నవమాసాలు మోసి, కని పెంచి, కంటికి రెప్పలాగా కాపాడి ఎలాగైతే తల్లి బిడ్డను పెంచునో అలాగే గాయత్రీ మాత కూడా ఉపాసకుని కాపాడును.

మంత్రము:

గాయతాం త్రాయతే ఇతి గాయత్రి - గానము చేయువాని రక్షించేది గాయత్రి. అనగా గొంతెత్తి బిగ్గరగా రాగ భావ శృతి లయ యుక్తంగా పాడవలెను కానీ నసుగుతూ సణుగుతూ వినబడీ వినబడనట్లు ఉచ్చరించుట సరైన పద్ధతి కాదు. కాబట్టి గాయత్రీ మంత్రం గొంతెత్తి బిగ్గరగా గానం చేయవచ్చునని గాయత్రీ పద నిర్వచనం, వ్యుత్పత్యర్థములు చెప్పుచున్నవి. మరియు, ఇది స్వరయుక్త మంత్రము. వైఖరీ వాక్కుతో పైకి ఉచ్చరించినపుడే స్వరభేదము స్పష్టముగా తెలియును కాబట్టి గాయత్రిని సుస్పష్టముగా, స్వరయుక్తముగా ఉచ్చరించవచ్చును. గాయత్రీ మంత్రములో నిర్దిష్టమైన అర్థవంతమైన వాక్య నిర్మాణము కలదు. "ఎవరు మా బుద్ధులను ప్రచోదనము చేయుచున్నారో అట్టి సవితృ మూర్తి యొక్క దివ్యమైన తెల్లని తేజస్సును మేము ధ్యానించుచున్నాము. ఒక నిర్దిష్టమైన అర్థము, అభ్యర్థనము వుండి ప్రార్థన, మంత్రము ఒకదానిలో ఒకటి అంతర్లీనమై వుండుటచే గాయత్రి మంత్రము మరియు ప్రార్థన కూడా యగును.

ఓం భూర్భువస్సువః| ఓం తత్సవితుర్వరేణ్యమ్|
భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్|

గాయత్రీ మంత్ర పదవిభాగము:

ఓం, తత్, సవితుః, వరేణ్యమ్, భర్గః, దేవస్య.
ధీమహి, ధియః, యః, నః, ప్రచోదయాత్

పదక్రమము:

వరేణ్యమ్, నః, ధియః,ప్రచోదయాత్ యః
తత్, ఓం సవితుః, దేవస్య, భర్గః, ధీమహి

అర్థములు:

వరేణ్యమ్ = కోరదగినదియు (అందరికీ శ్రేయస్సును కలిగించుటలో)
నః = మన
ధియః = బుద్ధులను
ప్రచోదయాత్ = ప్రేరేపించునదియు,
యః = ఎవరో
ఓం = ప్రణవ ప్రతీకమైన
తత్ = ఆ
సవితుః దేవస్య = వెలుగుల సవితృ మూర్తి యొక్క
భర్గః = స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన తేజస్సును
ధీమహి = ధ్యానించుదుము (గాక)

తాత్పర్యము:

అందరికి శ్రేయస్సును కలిగించుటలో కోరదగినదియు, మన బుద్ధులను ప్రేరేపించునది ఎవరో - ప్రణవ ప్రతీకమైన ఆ వెలుగుల సవితృమూర్తియొక్క(స్వయం ప్రకాశ ప్రాసర గుణ సమన్వితమైన) తేజస్సును ధ్యానించెదము గాక!

ఇది ఒక వర్ణము, వర్గము, కులము, మతము, లింగము (స్త్రీ పురుషులు అందరు పఠించవచ్చు), జాతికి చెందిన మంత్రము కాదని, సమస్త మానవాళి శ్రేయస్సు కోరేవారు ఒంటరిగానైనను, సామూహికముగా నైనను ఈ మంత్రమును ఉచ్చరించవచ్చునని దీని తాత్పర్యమువలన తేటతెల్లమగుచున్నది. ఇది సూర్యుని నుండి సౌరశక్తిని సూటిగా పొందుటకు భారతీయ ఋషులు దర్శించిన మంత్రము. భారతీయుల సర్వ మంత్రములు, ప్రార్థనలు ఇలాగే స్వార్థరహితముగా, సర్వజనహితముగా ఉండునని అందరూ గ్రహించవలెను.

లోకాస్సమస్తాః సుఖినో భవంతు | ఓం శాంతిః శాంతిః శాంతిః|
Read More

Sunday, 9 June 2013

Photo
Read More

గణపతి మంత్రం

గణపతి మంత్రం

ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం
గణాణాం” త్వా గణపతిగుం హవామహే
కవిం కవీనాం ఉపమశ్ర వస్తమం
జ్యేష్ఠ్రరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పద
ఆనశ్రణ్వన్ నూతిభిస్సీ దశాదనం

ప్రణో దేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి
ధీనామ విత్రయవతు
గణేశాయ నమః సరస్వత్యై నమః
శ్రీ గురుభ్యో నమః హరిః ఓం

Photo: గణపతి మంత్రం

ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం
గణాణాం” త్వా గణపతిగుం హవామహే
కవిం కవీనాం ఉపమశ్ర వస్తమం
జ్యేష్ఠ్రరాజం బ్రహ్మణాం బ్రహ్మస్పద
ఆనశ్రణ్వన్ నూతిభిస్సీ దశాదనం

ప్రణో దేవి సరస్వతి వాజేభిర్ వాజినీవతి
ధీనామ విత్రయవతు
గణేశాయ నమః సరస్వత్యై నమః
శ్రీ గురుభ్యో నమః హరిః ఓం
Read More

గాయత్రీ మంత్రాన్ని మించిన జపం లేదు...

“ఓం భూర్భువస్సువః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్”

దీ గాయత్రీ మంత్రం. మన పూజలు, మంత్రాల్లో ఈ మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. “న గాయత్ర్యాః పరం, మంత్రం నమాతుః పరదైవతం” అన్నారు పెద్దలు. అంటే తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు అనేది దీని భావం. ఆది శంకరాచార్యుడు “గాయాన్ త్రాయతే ఇతి గాయత్రీ” అన్నాడు. అంటే ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్ధం.

చాలామంది గాయత్రీ మంత్రాన్ని పదేపదే స్మరిస్తుంటారు. ఉచ్చరించ లేనివారు సీడీ పెట్టుకుని వింటారు. కానీ దీనికి అర్ధం ఎందరికి తెలుసు? కబీర్ దాస్ చెప్పినట్టు ‘చేతిలో జపమాల, నోట్లో రామనామం కదలాడినా మనసు కనుక చంచలమైతే ఫలితం లేనట్లే’, గాయత్రీ మంత్రానికి అర్ధం, పరమార్ధం తెలీనప్పుడు లక్షసార్లు విన్నా, స్మరించినా ప్రయోజనమే లేదు. అందుకే ముందుగా ఈ పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రానికి అర్ధం ఏమిటో తెలుసుకుందాం.

గాయత్రీ మంత్రంలో ప్రతి అక్షరానికీ అర్ధం ఉంది. స్థూలంగా - “లోకంలో సమస్తాన్నీ సృష్టించే, సర్వ విశిష్ట గుణాలతో, ఎవరు మన బుద్ధులను ప్రేరేపిస్తున్నారో, అటువంటి పరబ్రహ్మ స్వరూపుని, శ్రేష్టుని, జ్ఞాన ప్రకాశములు కలవానిని, పూర్తి రూపం ఉన్నవానిని ధ్యానిస్తాను” అని గాయత్రీ మంత్రానికి అర్ధం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే – “ప్రణవ స్వరూపుడు, అన్నిటికీ ఆధారమైనవాడు, అంతటా నిండి ఉన్నవాడు, సర్వేంద్రియములను ప్రకాశింపచేసేవాడు, సృష్టి, స్థితి, లయ, కారణభూతుడు, సమస్త దుఃఖాలను పోగొట్టి సర్వ సుఖాలను ఇచ్చే, స్వయం ప్రకాశకుడైన పరమాత్మునికి నా నమస్కారాలు” అని అర్ధం.

క్లుప్తంగా ఒక్క మాటలో చెప్పుకుంటే, “అన్ని లోకాల నుండి అన్నిటినీ నడిపించే మహాశక్తీ, మా బుద్ధులను ప్రక్షాళన చేసి, మంచి కర్మలను ఆచరించేలా ప్రేరేపించు” అని గాయత్రీ మంత్ర అర్ధం. ఈ మంత్రంలో ఉద్దేశించిన శక్తిని కొందరు నారాయణుడిగా తలిస్తే, ఇంకొందరు ఆది పరాశక్తిగా ధ్యానిస్తారు. మరికొందరు నిరాకార, నిర్గుణ బ్రహ్మగా భావిస్తారు.

రోజుకు వేయిసార్లు చొప్పున నెల రోజుల పాటు గాయత్రీ మంత్రాన్ని జపించినట్లయితే సర్వ పాపాలూ హరిస్తాయని ఉద్ఘాటించాడు మనువు.

ఇప్పుడు గాయత్రీ మంత్రాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం.

గాయత్రీ మంత్ర జపం చేయాలనుకునేవారు మొదట మూడుసార్లు ప్రాణాయామం ఆచరించి, ఆపైన గాయత్రీ జపం చేయాలి. జపం చేసే సమయాన్ని బట్టి భిన్న నామ రూపాలతో ప్రార్ధించాలి. ఉదయం గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా స్మరించాలి. ప్రాతః కాల వేళ తూరుపు దిశగా నిలబడి సూర్యోదయం అయ్యేవరకు ప్రార్ధించాలి. సాయంకాలం పడమటి దిశగా కూర్చుని, నక్షత్రాలు కనిపించేవరకూ ప్రార్ధించాలి. ఈ మంత్రాన్ని పైకి వినిపించకుండా మనసులోనే జపించాలని గుర్తుంచుకోవాలి.

గాయత్రీ మంత్రం ఇహ లోకంలో పాపాలను తొలగించి సంపూర్ణంగా రక్షించడమే కాకుండా, మరు జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే, ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపిస్తారు.
Read More

Friday, 7 June 2013

మంత్రమునకు నియమము ఉంటుందా


పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి అంటే మూడింటియందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది.
మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||

మంత్రం యందు భక్తి కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత అంటే మంత్రం వల్ల తెలిసే వ్యక్తి లేక మంత్రం యొక్క తాత్పర్యము అని అర్థం. క్షీరము అంటే పాలు అని అర్థం కాదు, అది అనువాదం అని అంటారు. తెల్లటి పుష్టి కలిగించే ద్రవాహారం, దానికి పాలు అని పేరు. అంటే క్షీరం అనే శబ్దం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ వస్తువు దాని అర్థం అవుతుంది. అట్లా మంత్రం అనగానే ఆయా మంత్రంలోని పదాల అర్థం అని కాదు, ఆ మంత్రం ప్రతిపాదించే దేవతా విశేషం ఏదో ఆ మంత్రానికి అర్థం అవుతుంది. ఆ దేవతా విశేషాన్ని కనిపించేటట్టుగా స్పష్టం అయితే అప్పుడు మంత్ర అర్థం తెలిసినట్లు. అంతే కాని మంత్రంలో పదాల అర్థం మాత్రమే తెలుసు అని అంటే మంత్ర తాత్పర్యం తెలియదు అనే లెక్క. మంత్రం గోచరించాలి అంటే మంత్రాన్ని వినవల్సిన క్రమంలో విని, అనుసంధించే క్రమంలో అనుసంధిస్తేనే ఫలిస్తుంది. మంత్రం పై విశ్వాసం అంటే ఆ మంత్రం యొక్క నియమాలపై విశ్వాసం అని అర్థం. ఎవరో ఎవరికో చెబుతుంటే విని, పుస్తకం చూసి చేస్తే  మంత్రం ఫలించదు. ఒక గురు ముఖతః శ్రవణం చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. ఇది మంత్రానికి నియమం.
Read More

శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము:

చిన్నపిల్లలకి దృష్టి దోషాలు తగులకుండా ఉండాలంటే ఈక్రింది శ్లోకాలను పఠిస్తూ విబూదిని చేతితో పట్టుకొని అభిమంత్రించి, దానిని పిల్లల నుదుటన – కంఠాన – వక్షస్థలమున - భుజాలపై రాస్తే, దృష్టిదోషాలు, సర్వ గ్రహ బాధలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగి శ్రీకృష్ణుని రక్షణ లభింపచేస్తాయి.
శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము:

వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II

మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.

Photo: చిన్నపిల్లలకి దృష్టి దోషాలు తగులకుండా ఉండాలంటే ఈక్రింది శ్లోకాలను పఠిస్తూ విబూదిని చేతితో పట్టుకొని అభిమంత్రించి, దానిని పిల్లల నుదుటన – కంఠాన – వక్షస్థలమున - భుజాలపై రాస్తే, దృష్టిదోషాలు, సర్వ గ్రహ బాధలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగి శ్రీకృష్ణుని రక్షణ లభింపచేస్తాయి.
శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకము:

వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II

మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
Read More

నిద్ర మేల్కొనుట

నిద్ర మేల్కొనుట
“బ్రహ్మీ ముహూర్తే ఉత్థాయ”, “బ్రహ్మీముహూర్తే యానిద్రా సాపుణ్య” అంటుంది ధర్మశాస్త్రం. బ్రహ్మ మూహూర్తం అనగా ఉదయం సూర్యోదయం అక్షాంశ రేఖను బట్టి ఏ ప్రదేశములో ఎన్ని గంటలకు జరుగుతుందో ఖచ్చితంగా తెలిసికొని దానికి ఒక మూహూర్తం అనగా రెండు ఘడియల కాలం అనగా 48 నిమిషముల ముందు కాలం ఆసురీ ముహూర్తం, దానికి 48 నిమిషములు ముందు కాలం బ్రహ్మ ముహూర్తం. ఆ సమయములో భగవచ్చింతన జేయువారిని దేవతలు ప్రీతిగా ఆశీర్వదిస్తారని, మానవ మేథస్సునకు బ్రహ్మ సంకేతములు అందు కాలము ఆ ముహూర్తమనియు, ఆ సమయమున నిద్రించువారి పూర్వ జన్మల మరియు ఈ జన్మన ఆర్జించిన పుణ్యము కూడ క్షయమగుననియు వేద ప్రమాణము. బ్రహ్మ మూహూర్తమున ధ్యానం సత్ఫల దాయకము.


Photo: నిద్ర మేల్కొనుట
“బ్రహ్మీ ముహూర్తే ఉత్థాయ”, “బ్రహ్మీముహూర్తే యానిద్రా సాపుణ్య” అంటుంది ధర్మశాస్త్రం. బ్రహ్మ మూహూర్తం అనగా ఉదయం సూర్యోదయం అక్షాంశ రేఖను బట్టి ఏ ప్రదేశములో ఎన్ని గంటలకు జరుగుతుందో ఖచ్చితంగా తెలిసికొని దానికి ఒక మూహూర్తం అనగా రెండు ఘడియల కాలం అనగా 48 నిమిషముల ముందు కాలం ఆసురీ ముహూర్తం, దానికి 48 నిమిషములు ముందు కాలం బ్రహ్మ ముహూర్తం. ఆ సమయములో భగవచ్చింతన జేయువారిని దేవతలు ప్రీతిగా ఆశీర్వదిస్తారని, మానవ మేథస్సునకు బ్రహ్మ సంకేతములు అందు కాలము ఆ ముహూర్తమనియు, ఆ సమయమున నిద్రించువారి పూర్వ జన్మల మరియు ఈ జన్మన ఆర్జించిన పుణ్యము కూడ క్షయమగుననియు వేద ప్రమాణము. బ్రహ్మ మూహూర్తమున ధ్యానం సత్ఫల దాయకము.
Read More

సాధనా పంచకం :

సాధనా పంచకం :

వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్
తేనేశస్య విధీయతామపచితః కామ్యే మతిస్త్యజ్యతామ్
పాపౌఘః పరిధూయతాం భవ సుఖే దోషో 'నుసంధీయతామ్
ఆత్మేచ్చా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతామ్ ॥ ౧

సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్ధృఢా ధీయతామ్
శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతామ్
సద్విద్వానుపసర్ప్యతాం ప్రతి దినం తత్పాదుకా సేవ్యతామ్
బ్రహ్మైకాక్షరమర్ధ్యతాం శృతి శిరో వాక్యం సమాకర్ణ్యతామ్ ॥ ౨

వాక్యార్థశ్చ విచార్యతాం శృతి శిరః పక్షః సమాశ్రీయతామ్
దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతి మతస్తర్కో 'నుసంధీయతామ్
బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరహర్గర్వ పరిత్యజ్యతామ్
దేహో 'హం మతిరుజ్జ్యతాం బుద జనైర్వాద పరిత్యజ్యతామ్ ॥ ౩

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతామ్
స్వాద్వన్నం న తు యాచ్యతాం విధి వశాత్ ప్రాప్తేన సంతుష్యతామ్
శీతోష్ణాది విషహ్యతాం నతు వృధా వాక్యం సముచ్చార్యతామ్
ఔదాసీన్య మభీప్స్యతాం జన కృపా నైష్టుర్యముత్సృజ్యతామ్ ॥ ౪

ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతామ్
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితి బలాన్నాప్యుత్తరైః శ్లిష్యతామ్
ప్రారబ్దం త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్ ॥ ౫


Photo: సాధనా పంచకం :

వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్
తేనేశస్య విధీయతామపచితః కామ్యే మతిస్త్యజ్యతామ్
పాపౌఘః పరిధూయతాం భవ సుఖే దోషో 'నుసంధీయతామ్
ఆత్మేచ్చా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతామ్  ॥ ౧

సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్ధృఢా ధీయతామ్
శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతామ్
సద్విద్వానుపసర్ప్యతాం ప్రతి దినం తత్పాదుకా సేవ్యతామ్
బ్రహ్మైకాక్షరమర్ధ్యతాం శృతి శిరో వాక్యం సమాకర్ణ్యతామ్  ॥ ౨

వాక్యార్థశ్చ విచార్యతాం శృతి శిరః పక్షః సమాశ్రీయతామ్
దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతి మతస్తర్కో 'నుసంధీయతామ్
బ్రహ్మాస్మీతి విభావ్యతాం అహరహర్గర్వ పరిత్యజ్యతామ్
దేహో 'హం మతిరుజ్జ్యతాం బుద జనైర్వాద పరిత్యజ్యతామ్  ॥ ౩

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతామ్
స్వాద్వన్నం న తు యాచ్యతాం  విధి వశాత్ ప్రాప్తేన సంతుష్యతామ్
శీతోష్ణాది విషహ్యతాం నతు వృధా వాక్యం సముచ్చార్యతామ్
ఔదాసీన్య మభీప్స్యతాం జన కృపా నైష్టుర్యముత్సృజ్యతామ్  ॥ ౪

ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతః సమాధీయతామ్
పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్
ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితి బలాన్నాప్యుత్తరైః శ్లిష్యతామ్
ప్రారబ్దం త్విహ భుజ్యతామథ పరబ్రహ్మాత్మనా స్థీయతామ్  ॥ ౫
Read More

కార్య జయం కలుగుటకు ఈ క్రింది శ్లోకాలు పఠిస్తూ బయలుదేరాలి

ఎచటికైనా ప్రయాణమై వెళ్ళునప్పుడు దుశ్శకున దోషములు, శతృ భూత ప్రేత బాలు తొలగి కార్య జయం కలుగుటకు ఈ క్రింది శ్లోకాలు పఠిస్తూ బయలుదేరాలి

శ్లో|| యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా|
తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః|
యేషా మిందీ వరశ్యామో హృదయస్థో జనార్దనః||

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం|
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్||


అగ్రతో నారసిమ్హశ్చ పృష్థతో బలకేశవౌ |
ఉభయోః పార్శ్వయోరాస్తాం సశరౌ రామలక్ష్మణౌ ||


హనమానంజనా సూనుః వాయు పుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షఒ మిత్ర విక్రమః
ఉదధి క్రమణస్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పటేన్నిత్యం యాత్రా కాలే విశేషతః
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ||



Photo: ఎచటికైనా ప్రయాణమై వెళ్ళునప్పుడు దుశ్శకున దోషములు, శతృ భూత ప్రేత బాలు తొలగి కార్య జయం కలుగుటకు ఈ క్రింది శ్లోకాలు పఠిస్తూ బయలుదేరాలి

శ్లో|| యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా|
తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం ||

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః|
యేషా మిందీ వరశ్యామో హృదయస్థో జనార్దనః||

ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదాం| 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్||


అగ్రతో నారసిమ్హశ్చ పృష్థతో బలకేశవౌ |
ఉభయోః పార్శ్వయోరాస్తాం సశరౌ రామలక్ష్మణౌ ||


హనమానంజనా సూనుః వాయు పుత్రో మహాబలః 
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షఒ మిత్ర విక్రమః
ఉదధి క్రమణస్చైవ సీతాశోక వినాశకః 
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా 
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పటేన్నిత్యం యాత్రా కాలే విశేషతః 
తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ||
Read More

సర్పభయ నివారణకు

సర్పభయ నివారణకు
సర్ప భయం ఉన్నవారు కానీ, సర్పం కనిపించి మీదికి వస్తున్నప్పుడు గానీ ఈ క్రింది మంత్రాలను స్మరిస్తే సర్పాలు దూరంగా తొలగిపోతాయి.

“నర్మదాయై నమో ప్రాతః, నర్మదాయై నమో నిశి । నమోఽస్తు తే నర్మదే తుభ్యం, త్రాహి మాం విష సర్పతః ।।
సర్పాయ సర్పభద్రం తే, దూరం గచ్ఛ మహావిషమ్ । జనమేజయ యజ్ఞాన్తే, ఆస్తిక్యం వన్దనం స్మర ।।
ఆస్తిక్య వచనం స్మృత్వా, యః సర్పో న నివర్తతే । భిద్యతే సప్తధా మూర్ఘ్ని, శింశ వృక్ష ఫలం యథా ।।
యో జరుత్కారుణ యాతో, జరుత్ కన్యా మహాయశాః । తస్య సర్పశ్చ భద్రం తే, దూరం గచ్ఛ మహా విషమ్ ।।

నాగలి మన్నుగానీ, నీలి రంగు సరసులోని నీటినిగానీ పై మంత్రముతో ೧೦೦೦ సార్లు అభిమంత్రించి ఇంటి చుట్టూ రక్షగా పోస్తే సర్పములు లోనికి ప్రవేశించవు.
‘ హౌం జూం సః’ – రోజుకి ౧౦౦౦ సార్లు ౧౦౮ రోజులు జపిస్తే నాగ దోషం తొలగుతుంది.
బిల్వదళం మీద దానిమ్మ కలముతో "శ్రీరామ" లిఖించి శివునిపూజించినా నాగ భయంతొలగుతుంది.
“శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే । సర్వ స్యార్తి హరే దేవీ నారాయణీ నమోఽస్తు తే ।।” – ౧౦౮ సార్లునిత్యం పఠిస్తూ ఉన్నా నాగభయం ఉండదు


Photo: సర్పభయ నివారణకు
సర్ప భయం ఉన్నవారు కానీ, సర్పం కనిపించి మీదికి వస్తున్నప్పుడు గానీ ఈ క్రింది మంత్రాలను స్మరిస్తే సర్పాలు దూరంగా తొలగిపోతాయి. 

“నర్మదాయై నమో ప్రాతః, నర్మదాయై నమో నిశి । నమోఽస్తు తే నర్మదే తుభ్యం, త్రాహి మాం విష సర్పతః ।।
సర్పాయ సర్పభద్రం తే, దూరం గచ్ఛ మహావిషమ్ । జనమేజయ యజ్ఞాన్తే, ఆస్తిక్యం వన్దనం స్మర ।।
ఆస్తిక్య వచనం స్మృత్వా, యః సర్పో న నివర్తతే । భిద్యతే సప్తధా మూర్ఘ్ని, శింశ వృక్ష ఫలం యథా ।।
యో జరుత్కారుణ యాతో, జరుత్ కన్యా మహాయశాః । తస్య సర్పశ్చ భద్రం తే, దూరం గచ్ఛ మహా విషమ్ ।।

 నాగలి మన్నుగానీ, నీలి రంగు సరసులోని నీటినిగానీ పై మంత్రముతో ೧೦೦೦ సార్లు అభిమంత్రించి ఇంటి చుట్టూ రక్షగా పోస్తే సర్పములు లోనికి ప్రవేశించవు.
‘ హౌం జూం సః’ – రోజుకి ౧౦౦౦ సార్లు ౧౦౮ రోజులు జపిస్తే నాగ దోషం తొలగుతుంది.
బిల్వదళం మీద దానిమ్మ కలముతో "శ్రీరామ" లిఖించి శివునిపూజించినా నాగ భయంతొలగుతుంది.
“శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే । సర్వ స్యార్తి హరే దేవీ నారాయణీ నమోఽస్తు తే ।।” – ౧౦౮ సార్లునిత్యం పఠిస్తూ ఉన్నా నాగభయం ఉండదు.
Read More

Friday, 31 May 2013

జయ మంత్రము



జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||

రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు

ఈ జయ మంత్రాన్ని ఎవరు పఠిస్తారో వారికి విజయం తథ్యం

Photo: జయ మంత్రము

జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః||
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహన్తా మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||
అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్||

 రాముడు, లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు. ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు. అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను. నా పేరు హనుమ, నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను, ఈ రావణుడి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తోక్కేస్తాను, నా పిడి గుద్దులతో చంపేస్తాను, పెద్ద పెద్ద చెట్లతో, రాళ్ళతో కొడతాను. వెయ్యిమంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం. నన్ను ఆపగలిగేవాడు ఈ లంకా పట్టణంలో లేడు. సీతమ్మకి నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంకా పట్టణంలో లేడు 

ఈ జయ మంత్రాన్ని ఎవరు పఠిస్తారో వారికి విజయం తథ్యం
Read More

Powered By Blogger | Template Created By Lord HTML