జ్యేష్ఠ మాసే సితేపక్షే దశమీ హస్త సంయుతా
జ్యేష్ఠ శుద్ధ దశమి, హస్తా నక్షత్రం ఉన్న రోజున గంగా స్నానము విశేష ఫలితాన్ని ఇస్తుంది.
గత పది జన్మలుగా చేసిన పదిరకాల పాపములనుండి విమక్తి పొందుతారు.
( మూడు కాయక(శరీరంతో చేసే) పాపాలు
ఇవ్వకుండా ఇతరులవస్తువులు తీసుకొనుట, యజ్ఞాది విధుల యందు తప్ప అన్యత్రా హింస,పరభార్యా సేవనము
నాలుగు వాచక(నోటితో చేసే పాపాలు) కఠినమైన మాటలు, చాడీలు చెప్పటం,అసంబద్ధ,అసత్య సంభాషణము
మూడు మానశిక దోషములు
పరద్రవ్యమందు ధ్యానం,అనిష్టము చింతించుట,మిధ్యాభుత పనులయందు ఆగ్రహం)
పైన ఉన్న దోషములు పది జన్మలుగా వస్తున్న వాటిని గంగ దగ్ధం చేయును. కర్మ బీజములను దగ్ధం చేయుగల శక్తి శ్రీ కాశీ విశ్వనాధునకు కలదు.
No comments:
Post a Comment