What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 15 June 2017

ఇది వాల్మికి రామాయణము లోనిది కాదు. హనుమద్వైభవము తెలుపునది కావున మరోసారి చెపుతాను..

ఇది వాల్మికి రామాయణము లోనిది కాదు. హనుమద్వైభవము తెలుపునది కావున మరోసారి చెపుతాను..
.
శ్రీరామ పట్టాభిషేకమునకు ఏర్పాట్లలో స్వామి హనుమ అన్నిటా తానై మునిగి తేలుతున్నాడు. ప్రపంచము నలుమూలలనుండి రాజులు అయోధ్యకు తరలి వస్తున్నారు. వారికి రాజప్రాసాదాలలో వసతులు, ఆహారపానీయాదులు సరైన సమయానికి అందుతున్నాయో లేదో కనుక్కుంటూ స్వామి హనుమ క్షణం తీరికలేకుండా శ్రమిస్తూన్నాడు. పైగా కోట్లాది వానర వీరులను వివి
ధ పనులలో నియంత్రించడము సామాన్యమైన విషయం కాదు గదా! ఇదంతా తల్లి సీతమ్మ గమనిస్తూ
స్వామి హనుమను పిలిచి " నాయనా శ్రీరామ పట్టాభిషేకము నీవు అనుకున్నట్లుగా సవ్యంగానే జరుగుతుంది. ముందు నీవు భోజనము చెయ్యి. నాలుగు ముద్దలు నీకు వడ్డిస్తాను. ఇలారా నాయనా! ఇలా కూర్చుని నేను వడ్డించే పదార్ధములు తృప్తిగా ఆరగించు!" అని ఆప్యాయంగా పిలిచించింది. సీతామాత అలా అప్యాయంగా పిలిచేసరికి స్వామి హనుమ కాదనలేక మాత వడ్డించిన ఆహారపదార్ధములు ఆరగించటము ప్రారంభించాడు. మాత వడ్డన, స్వామి ఆరగింపు సాగుతునే ఉన్నాయి. కోట్లాది అతిధులకై చేయించిన ఆహారపదార్ధములు " వడ్డించమ్మా! వడ్డించు" అని మెచ్చుకుంటూ స్వామి హనుమ ఇట్టే స్వాహా చేసేస్తున్నాడు. మాత సీత కంగారు పడుతూ చెలికత్తెలను పరుగులు తీయిస్తోంది. వారు ఇతర ప్రసాదాల వంటకాలు తరలిస్తూనే ఉన్నారు. అన్ని వంటకాల పాత్రలు ఖాళీ అవుతున్నాయి. శ్రీరామచంద్రుడు అక్కడ జరుగుతున్న సమాచారం తెలుసుకుని వచ్చి గోడవారగా నిలబడ్డాడు. సీతామాత ఆయన దగ్గరకు వెళ్ళి " అనంతమైన ఆహారపదార్ధములు హనుమ క్షుద్బాధ తీర్చలేక పోతున్నాయి. స్వామీ! ఏమి స్వామి! తరుణోపాయం చెప్పండి! " అని చేతులు జోడిస్తే, అప్పడు శ్రీరాముడు " సీతా! హనుమ అనుకుంటే ఎవరు అనుకున్నావు? రుద్రాంశ సంభూతుడు. నిన్ను, నన్ను కాపాడటానికి ఈ భువికి దిగిన పరమేశ్వరుడు. ఆయనకు పంచాక్షరీ మంత్రము మనస్సున తలచుకొని ఒక ముద్ద వడ్డించు. ఆయన తృప్తి పడతాడు" అని ఉపదేశిస్తాడు. సీతామాత ఒక ముద్ద చేతిలో తీసుకుని " నిన్ను సామాన్యునిగా తలచి, మాయలో పడ్డాను. నీ తల్లిని క్షమించు తండ్రీ! ఓం నమ:శివాయ" అంటూ స్వామి హనుమ విస్తరిలో వడ్డిస్తుంది. స్వామి హనుమ ఆ ముద్ద తృప్తిగా ఆరగించి " శ్రీరామా తృప్తాత్మా! " అంటూ త్రేన్చి ఉత్తారోపసనం చేసి " అన్నదాతా! సుఖీభవ! ! " అని భోజనం ముగిస్తాడు. ఆయన అలా అనగానే ఖాళీ అయిన ఆహారపదార్థాలు యధాతధంగా ఆయా పాత్రలలో వచ్చి చేరాయి.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML