What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 24 February 2014

ఇది చేతులారా చేసుకునే దుష్క్రుత్యం. కేవలం మనతప్పే. ఎవరో వచ్చి చెడగొట్టారు అనేది తప్పు


మన హిందువుల్లో ఈ మధ్య ఒక జాడ్యం పట్టుకుంది. ఇతరులు చెప్పేమాటలు, చెప్పుడు మాటలు విని, లేక అనుభవంలోకి కొన్ని సంఘటనల మూలంగా ఇతరులని, ఇతర మతాల వారిని దూషిస్తున్నారు. ఇంతకుముందు నేను దూషించాను. కాకపోతే ఇది సరైన పద్దతి కాదు.
ఎందుకంటే మన హిందూ సంస్కృతిలో అసలు ఏముంది? వ్యాసుడు ఏమి చెప్పాడు? వేదాలు, ఇతిహాసాలు, పురాణాలూ, ఉపనిషత్తులు మనకి ఏమి చెప్తున్నాయి? అనే విషయాన్ని వదిలేస్తున్నారు.. కనీసం వీటి వైపు చూడటంలేదు. ఇది ఎలా ఉందంటే చేతిలో ఆయుధం లేకుండా శత్రువు మీదకి యుద్దానికి వెళ్లినట్టు ఉంది. ఇక్కడ మనదేశంలో అనేక మతాలు హిందు సంస్కృతిని భూస్థాపితం చేయడానికి ప్రయత్నించి సఫలం అవుతూ ఉండటానికి కారణం మనం మన సంస్కృతిని, మన వేదాలని, ఇతిహాసాలని, పురాణాలని చదవకుండా వదిలేయడమే! అందులో ఏమి చెప్పారో తెలుసుకోకపోవడమే.
ఎవరైనావిదేశీయుడు వచ్చి నీ హిందు జాతి గురించి అడిగితె ఏమి చెప్తావ్? కనీసం భారతం, భాగవతం, రామాయణం ఎవరు వ్రాసారు అంటే చెప్పడానికి చాలామంది దగ్గర సమాధానం లేదు. ఒకవేళ వారి పేర్లు తెలిసినా వారు ఎవరో, వారి చరిత్ర ఏమిటో చెప్పలేరు.. ఇది అక్షరాల 100% నిజం.
మన సంప్రదాయాలని ఎందుకు వదిలేస్తున్నారు? విదేశీయుల మోజులో ఎందుకు పడుతున్నారు? విదేశీ కట్టుబాట్లు, విదేశీ దేవుళ్ళు, విదేశీ భాషల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.. ఈ రోజు రామాయణం, మహాభారతం ఇంగ్లీష్ లో వ్రాస్తే చదువుకునే దౌర్భగ్య పరిస్థితి పిల్లలకి తీసుకొచ్చారు.. చివరికి వేమన శతకం చదవాలన్న ఇంగ్లీష్ లో చెపితే చదువుతారు..
మనదేశ చరిత్ర 1947 కి ముందు ఒకలా ఉంది. స్వాతంత్రం వచ్చిన వెంటనే కొన్ని లక్షలమంది హిందువులు ఊచకోతకి గురయ్యారు. ఈ 60 ఏళ్ళలో వచ్చిన మర్పుకంటే గడిచిన 10 ఏళ్ళలో విపరీతంగా నాగరికత పెరిగి వినాశనం ఎక్కువయింది. సూర్య నమస్కారం చేయకూడదని కొందరు, మహాభారతం ఆపేయాలని కొందరు, ఇలా మనదేశంలోనే మనకి రక్షణ కరువయ్యే స్థితిలోకి వచ్చాము. ప్రత్యేకించి ఇప్పుడు లాక్కెళ్ళి నాశనం చేసే జాతి హిందువులలోనే తయారయ్యింది. ఇది చేతులారా చేసుకునే దుష్క్రుత్యం. కేవలం మనతప్పే. ఎవరో వచ్చి చెడగొట్టారు అనేది తప్పు. అలా వెళ్ళేలా చేసింది, చేస్తుంది మనమే. మన శాస్త్రాలు వదిలేయడమే మూలకారణం..

--
kishore always with u....!


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML